TS EAMCET Result 2023: నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..

విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 2023 నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 9:30 గంటలకు ఎంసెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలు ఫలితాలు విడుదల చేస్తారని చెప్పారు. కానీ సమయంలో స్వల్ప మార్పులు చేశారు. అనివార్య పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ బీ. డీన్ కుమార్ తెలిపారు.

ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను విడుద‌ల చేస్తారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎంసెట్ ఫ‌లితాలను https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఎంసెట్ విడుదల ఫలితాల కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి పాల్గొననున్నారు.

ts eamcet result 2023

మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు పెట్టారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లో జరిగాయి. ఈ పరీక్షలకు సంబంధించి అధికారులు ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్‌లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్‌ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఎంసెట్ ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. గత ఏడాది ఇంజినీరింగ్ ఫీజుల విషయమై కౌన్సెలింగ్ కాస్త ఆస్యంగా జరిగింది. ఈసారైనా కౌన్సెలింగ్ సరైన సమయంలో నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ పాలీసెట్ ఫలితలను మే 26 విడుదల చేయనున్నారు. మే 17న తెలంగాణ వ్యాప్తంగా 296 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు మొత్తంగా 98,273 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+