Youtuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ కు తెలంగాణ షాకులు..!

టాలీవుడ్ నటుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యల తర్వాత వీటిపై స్పందిస్తూ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ ఓ వీడియో చేసాడు. ఈ వీడియోలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు మరింత రచ్చకు కారణమయ్యాయి. దీనిపై తెలంగాణలో పలు చోట్ల ఫిర్యాదులు అందడంతో పోలీసులు వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో అన్వేష్ కు షాకులు తప్పడం లేదు.

నటుడు శివాజీ వ్యాఖ్యలపైై స్పందించే క్రమంలో హిందూ దేవతల్ని కించపరిచేలా యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో చేశారు. దీనిపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో వారు తెలంగాణ పోలీసులకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ తో పాటు ఖమ్మం, ఇతర ప్రాంతాల్లో అన్వేష్ పై కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా కరాటే కళ్యాణి చేసిన ఫిర్యాదుపై స్పందిస్తూ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Telangana police registers cases against youtuber anvesh for inflammatory comments on hindu gods

నా అన్వేషణ పేరుతో నడుపుతున్న యూట్యూబ్ ఛానల్లో అన్వేష్ దేశ, విదేశాలకు తిరుగుతూ పర్యాటకంపై పలు వీడియోలు చేస్తుంటారు. అయితే మధ్యలో ఆయన చేస్తున్న వీడియోల్లో చేసే వ్యాఖ్యలు పలుమార్లు వివాదాలకు కారణమయ్యాయి. తాజాగా నటుడు శివాజీ, గరికపాటి నరసింహారావుపై వ్యాఖ్యలు చేస్తూ అన్వేష్ చేసిన వీడియో కూడా ఇలాగే జనానికి మంటపుట్టించింది. దీంతో అన్వేష్ ఛానల్ కు ఉన్న భారీ సబ్ స్క్రైబర్లు కూడా అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో వీడియో చేసి వారికి సారీ కూడా చెప్పాడు. అయినా యూజర్లు వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు పోలీసులు కేసు కూడా నమోదు చేయడంతో తదుపరి ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+