Barrelakka: బర్రెలక్క క్యాంపెయిన్ వీడియో చూస్తే గూస్ బంప్సే భయ్యా..!

కొల్లాపూర్: బర్రెలక్క..అలియాస్ శిరీష. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు. 25 ఏళ్ల అతి చిన్న వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న బర్రెలక్కకు పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ విపరీతమైన మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు బర్రెలక్క వీడియో ట్రెండింగ్‌లో ఉంటోంది.

ఒక పేదింటి బిడ్డ... మంచి ఉద్యోగం సంపాదించి తన తల్లిదండ్రులను కుటుంబాన్ని సంతోషంగా ఉండేలా చూసుకుందామని ఎన్నో కలలు కన్న శిరీషకు ప్రభుత్వం నుంచి భంగపాటు కలిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు, పైగా పేపర్ లీకేజీలతో బర్రెలక్క మనసు విరిగిపోయింది. దీంతో చేసేదేమీలేక బర్రెలు కాచుకుంటున్నానంటూ చేసిన ఒకే ఒక వీడియోతో ఆమె ఎవరో ప్రజలకు తెలిసింది.

Telangana polls: Video of social media sensation Barrelakka election campaign goes viral

ఇక ఇదే సమయంలో తెలంగాణ ఎన్నికలు రావడంతో తానే ఎమ్మెల్యేగా ఎందుకు పోటీచేయకూడదని ఆలోచించింది. వెంటనే ఆ ఆలోచనను అమల్లో పెట్టింది. నామినేషన్ వేసింది. తెలంగాణ నిరుద్యోగులు పడుతున్న కష్టాలను ఆమె తన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. నిరుద్యోగ యువత నుంచే కాక పలు గ్రామాల్లో బర్రెలక్కకు పూర్తి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే బర్రెలక్కకు భారీ ఆఫర్లే ఇతర రాజకీయ నాయకుల నుంచి వచ్చాయి. కానీ వాటికి తలొగ్గకుండా ఆమె లక్ష్యం వైపు వెళుతున్నారు.

బర్రెలక్క ఎంట్రీతో తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ చిల్లు పడుతుందో అని భావించిన ప్రత్యర్థులు ఆమెపై, ఆమె అనుచరులపై దాడి కూడా చేశారు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుని బర్రెలక్కకు భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక బర్రెలక్క ప్రచారంలో దూసుకెళుతోంది. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బర్రెలక్క ప్రచారంలో ఓపాటకు అవ్వ తాతలు డాన్స్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. బర్రెలక్క ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని పలువురు ఆమెను దీవిస్తున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొత్తానికి బర్రెలక్క జోష్ చూస్తుంటే కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈమె ఎంట్రీతో ప్రత్యర్థుల ఓట్లు కచ్చితంగా చీలుతాయనే విశ్లేషణ సైతం వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+