తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదల: నోటిఫికేషన్ కూడా నేడే, ఎంసెట్ పరీక్ష యథాతథం, కానీ..

హైదరాబాద్: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ విడుదల చేశారు. జూన్ 30న 365 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వించారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులతోపాటు అగ్రికల్చర్, హార్టికల్టర్ సీట్లను పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేయనున్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం జూన్‌ 30న పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 1,04,432 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 75.73 శాతం మంది అంటే 79,038 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో బాలురు 40,669 మంది అంటే 72.12 శాతం, బాలికలు 38,369 మంది అంటే 79.99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

Telangana: POLYCET 2022 results released: notification also today .

పాలిసెట్‌ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది, బైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in, https://polycetts.nic.in, www.sbtet.telangana.gov.in వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు.

నేడు పాలిసెట్‌ నోటిఫికేషన్‌

పాలిసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని విద్యాశాఖ కమిషనర్ నవీన్‌ మిట్టల్‌ ప్రకటించారు. జులై 18 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభవుతాయని, ఆగస్టు 15 వరకు అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టికల్చర్‌ వర్సిటీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయన్నారు.

ఎంసెట్ పరీక్ష యథాతథం

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎంసెట్ పరీక్ష వాయిదా వేస్తారనే వార్తలపై సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్ మిట్టల్ స్పష్టతనిచ్చారు. జులై 18 నుంచి 20 వరకు జరిగే ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని.. షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. వాయిదా వేస్తే ఆన్‌లైన్ పరీక్షలకు షెడ్యూలు ఖరారు చేయడం కష్టమన్న ఉద్దేశంతో కొనసాగించాలని నిర్ణయించినట్లు నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు.

కాగా, ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నందున రేపు, ఎల్లుండి(14,15తేదీల్లో) జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జులై 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ యథాతథంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+