భారీ వర్షాలు.. తెలంగాణాకు వరుణుడి తీవ్ర హెచ్చరిక!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన ఉంటుందని, ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల వరకు 11 జిల్లాలలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న క్రమంలో ఆయా జిల్లాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి శుక్రవారం నాడు వాయువ్యంలో కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వివరించింది.

telangana rains alert heavy and extreme heavy rains serious warning to telangana

ఈ జిల్లాలలో నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు
శనివారం నాటికి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా వైపు కదిలే క్రమంలో బలపడి వాయుగుండం గా మారవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నేడు ఆదిలాబాద్, కుమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి ఈ జిల్లాలలో అతిభారీ వర్షాలకు చాన్స్
శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం నిజామాబాద్ జిల్లా, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

హైదరాబాద్ లోనూ వర్ష సూచన
నేడు ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయి. ఈ సమయంలో తెలంగాణలో గంటకు 8 నుంచి 12 కిలోమీటర్లు గాలి వేగం ఉంటుంది. ఈరోజు సాయంత్రానికి గాలి వేగం మరింత పెరుగుతుంది. ఇది ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పగటి వేళ యావరేజ్ ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గాయి.

హైదరాబాద్ వాసులు వర్షాలతో అలెర్ట్
తెలంగాణలో 26 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత ఉంది. ఇంతలా ఈ మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు ఏ రోజు తగ్గలేదు. ఇక హైదరాబాద్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కనుక హైదరాబాద్ ప్రజలు వర్షాలు కురుస్తున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+