ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ పంపించిన బంగాళాఖాతం!!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.దీంతో ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్
వాయుగుండం ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు.

Telangana rains Extreme Heavy rains and red alert to these districts today IMD warning

ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. హైదరాబాద్ లోనూ వర్షాలు
మరోవైపు నారాయణపేట, మెదక్, మహబూబ్నగర్, ఆదిలాబాద్, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హైదరాబాద్లోనూ నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సూచిస్తుంది.

నిన్నంతా కుండపోతగా వాన
ఇదిలా ఉంటే నిన్న రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఒక మోస్తరు వర్షాలు నిన్న నమోదయ్యాయి .వాగులు, వంకలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని జూరాలలో 17 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలానికి 48 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. వర్షాలు వరదల కారణంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది.

మేడిగడ్డ వద్ద గోదావరికి కొనసాగుయ్హున్న వరద
మేడిగడ్డ వద్ద గోదావరి నదికి వరద కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 4.6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదయింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 1.79 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్ని జిల్లాల్లోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+