వాయుగుండం ప్రభావం..నేడు తెలంగాణాలోని ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

వర్షాకాలం ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. వాతావరణ శాఖాధికారులు హెచ్చరికల ప్రకారం ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

బంగాళాఖాతంలో వాయుగుండం

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న నైరుతి రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా మారడంతో తెలంగాణ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఒడిశాలోని బాలాసోర్ కు 50 కిలోమీటర్ల దూరంలో, చాంద్ బలి, దిఘాలకు 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Telangana rains imd warning to these districts with heavy rains due to low pressure in bayof bengal and mansoon

తెలంగాణాలో విస్తారంగా వర్షాలు

దీని ప్రభావంతో పాటు ఉపరితల ఆవర్తనం, చురుకుగా కదులుతున్న రుతుపవనాల కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఆకాశం మేఘ మేఘావృతమై ఉంటుందని, మరికొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఈ జిల్లాలలో భారీ వర్షాలు

ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.

ప్రజలకు వర్షాలపై అలెర్ట్

వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకునేవారు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కారణంగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి.. స్థానికులకు ఉద్యోగాలపైన శుభవార్త!
కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి.. స్థానికులకు ఉద్యోగాలపైన శుభవార్త!

హైదరాబాద్ లో తాజా పరిస్థితి ఇలా

ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమైంది. పగటిపూట తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంచనా 45 శాతం వరకు మాత్రమే వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+