తెలంగాణాను వర్షాలతో వేధిస్తున్న వరుస అల్పపీడనాలు... ఐఎండీ తాజా హెచ్చరిక!

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. చలికాలంలో కూడా కురుస్తున్న వర్షాలు తెలంగాణ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. గత గజా వణకాల్సిన చలిలో కూడా వర్షాలు కురవడం, చలిగాలులు వీస్తూ ఉండడంతో భిన్న వాతావరణ పరిస్థితి నెలకొంది. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల దెబ్బ తెలంగాణ రాష్ట్రం పైన బాగానే పడుతుంది.

అల్పపీడన ప్రభావం.. తెలంగాణలో వర్షాలు
తాజాగా శనివారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటలలో తీవ్ర అల్పపీడనంగా బలపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా విస్తరించి ఉండటంతో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.

Telangana rains update bay of bengal low pressure effect on telangana districts with rains

మరో అల్పపీడనం త్వరలో
ఇవి మాత్రమే కాదు ఈనెల 14 లేదా 15 తేదీలలో అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది 16, 17 తేదీల నాటికి ఏపీ, తమిళనాడు వైపు పయనిస్తుందని దీని ప్రభావంతో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

నేడు ఈ జిల్లాలలో వర్షాలు
ఇక ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేడు యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యపేట జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ లోనూ వర్షాలు
ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, ఈరోజు తెల్లవారుజాము నుంచి అనేక ప్రాంతాలలో వర్షం కురుస్తుంది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, బేగంపేట, కుత్బుల్లాపూర్, బాలానగర్, మూసాపేట, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, చైతన్యపురి, హస్తినాపూర్ సహా పలు ప్రాంతాలలో ఈరోజు ఉదయం నుంచి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం కురుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+