తెలంగాణాకు తీవ్ర హెచ్చరిక.. ఐఎండీకి వరుణ సందేశం!!

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఆగస్టు నెలలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల, కేరళ తీరంలో ఉపరితల ద్రోణి బలంగా కొనసాగుతున్న కారణంగా, అరేబియా సముద్రంలో తుఫాను ఏర్పడిన కారణంగా నేటి నుంచి ఐదు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది.

తెలంగాణలో నేడు వర్షాలు
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. నిన్న సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో జల్లులు కురుస్తున్నాయి. ఈ పరిస్థితి ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని, మధ్యాహ్నం మూడు తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరువర్షాలు మొదలై అర్ధరాత్రి వరకు అలాగే కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Telangana rains update heavy rainfall in these districts today IMD Serious warning

నేడు తెలంగాణాలో ఈ జిల్లాలలకు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆయా జిల్లాల ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. వారికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.

నేడు ఈ జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఇదిలాఉంటే నేడు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలోని అనేక ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

హైదరాబాద్ లోనూ నేడు వర్షాలు
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నగరంలో గరిష్టంగా 31 డిగ్రీలు కనిష్టంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ లో వాతావరణ శాఖ వెల్లడించింది. ఏది ఏమైనా వర్షాలు పడే జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ పనులు చేసుకునే వారు వర్షాలు పడే సమయంలో చెట్ల కిందకి వెళ్లకుండా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+