తెలంగాణాను తీవ్రంగా హెచ్చరించిన వాతావరణ శాఖ!!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే మూడు రోజులుగా పలు ప్రాంతాలలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండగా నేడు కూడా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. వాతావరణ శాఖ అంచనాలతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు అధికారులు.
ఉత్తర తెలంగాణా జిల్లాలలో నేడు వర్ష బీభత్సం
తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాల ప్రజలు వర్షాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలలో గరిష్టంగా 11.5 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడతాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది.

అధికారులు అలెర్ట్
లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపుకు గురయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఇక రానున్న మూడు రోజుల్లో ఏ జిల్లాలలో వర్షం పడుతుందో వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు .
రేపు ఈ జిల్లాలలో వర్షాలు
రేపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అంతే కాదు అదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, నిర్మల్, వరంగల్, నల్గొండ, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్ నారాయణపేట జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎల్లుండి ఈ జిల్లాలలో భారీ వర్షాలు
ఎల్లుండి శుక్రవారం నాడు మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు అవుతాయని పేర్కొంది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, హనుమకొండ, వరంగల్, సూర్యపేట, జనగామ, యాదాద్రి, సిద్దిపేట, భువనగిరి జిల్లాలలో శుక్రవారం నాడు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
శనివారం వర్షాలు ఈ జిల్లాలలో
శనివారం కూడా రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజల అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications