తెలంగాణాకు వరుణుడి హెచ్చరిక.. హైదరాబాద్ లో మొదలైన కుండపోత!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి, రుతుపవనాల ప్రభావంతో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది .
తెలంగాణాలో ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, జనగామ, హన్మకొండ, జనగామ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక్కడ .గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ఈ జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు
అంతేకాదు భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది పశ్చిమ, వాయువ్య దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ లో జోరువాన
ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోటి, నాంపల్లి, సోమాజిగూడ, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, హయత్ నగర్ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ లో అనేకచోట్ల ట్రాఫిక్ అంతరాయం
ముఖ్యంగా చాదర్ ఘాట్ ఎల్బీనగర్ మధ్యలో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది చోటుచేసుకుంది. వివిధ ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం కురిసే ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆ సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తుంది.












Click it and Unblock the Notifications