అప్పటిదాకా వర్షాలే.. తెలంగాణాకు వాతావరణ కేంద్రం హెచ్చరిక!
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న ఆరు రోజుల పాటు తెలుగు పాట నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతేకాదు ఈనెల 29వ తేదీ నాటికి తూర్పు మధ్య పరిసర ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో 26, 27 తేదీలలో వర్షాలు
ఇక ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పిన ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఆగస్టు 26, 27 తేదీలలో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే.

27వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వర్షాలు ఈ జిల్లాలలో
ఇక ఈ క్రమంలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక 27వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
28వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య వర్షాలు పడే జిల్లాలు ఇవే
గంటకు 30కిలోమీటర్ల నుంచి 40కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇక 28వ తేదీ నుంచి 29వ తేదీ మధ్య పది జిల్లాలలో భారీవర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఆరు రోజుల పాటు వర్షాలు.. అలెర్ట్
29 నుంచి 30వ తేదీ మధ్య పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని , ఆగస్ట్ 31 నుండి సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు రాష్ట్రంలో పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మొత్తం ఆరు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నచోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.












Click it and Unblock the Notifications