Rains: తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..!
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రేపు ఎల్లుండి కుడా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం అర్ధరాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజ్ గిరి, ముషీరాబాద్ లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లన్ని జలమయం అయ్యాయి. తెల్లవారుజామున కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలిపాటి వాన పండింది.
శుక్రవారంహైదరాబాద్ నగరవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. సెప్టెంబర్ 28 వరకు రాష్ట్రంలో అక్కడకక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. వారం కిందటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురిస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 23, 24 పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాలో భారీ వర్షాలు పడే చాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జగిత్యాల, కామారెడ్డి, కుమ్రంభీం, మెదక్, మేడ్చల్, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనంతో పాటు దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశవైపు వాలి ఉందని వివరించింది. రాష్ట్రంలో కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నట్టు తెలిపింది. అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రుతుపవనాలు కూడా తిరోగమనం పట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 వరుక రుతుపవనాలు తిరుగుముఖం పట్టనున్నాయి.












Click it and Unblock the Notifications