తెలంగాణా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. శుభవార్తల వెల్లువ, టార్గెట్ ఫిక్స్!
సామాజిక న్యాయం సాధించేలా విజన్ డాక్యుమెంట్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణా రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణా దీర్ఘకాలిక లక్ష్యాలను తెలిపారు. తెలంగాణ అభివృధ్దికి విజన్ డాక్యుమెంట్ 2047 ఓ దిక్సూచి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విస్తృత సంప్రదింపులు, అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే దీన్ని రూపోందించాం అని చెప్పారు.ఈ సమ్మిట్ ద్వారా శుభవార్తలు చెప్పారు.
త్వరలో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
ఫ్యూచర్ సిటీ లో త్వరలో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు చెప్పారు. ఫ్యూచర్ సిటీని నెట్ జీరో కార్బన్ సిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. 13 వేల 500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసి మెట్రో రైలుతో అనుసంధానిస్తామని జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని శ్రీధర్ బాబు వివరించారు.

ఎఫోర్టబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్భన్ ఫ్యూచర్ పై మంత్రి పొంగులేటి
ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. 'ఎఫోర్టబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్భన్ ఫ్యూచర్" అనే అంశంపై సదస్సులో రాష్ట్రంలో సుమారు మూడున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా లక్ష ఇళ్లు నిర్మించినట్లు వివరించారు.
అత్యాధునిక డ్రై పోర్ట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రోడ్ సెక్టర్ పాలసీని తీసుకువచ్చామని, ఇది రైజింగ్ తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కు పునాది అని రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనెక్టెడ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ ఫోర్ట్, అర్బన్ రూరల్ కనెక్టివిటీ అనే అంశంపై ఆయన గ్లోబల్ సమ్మిట్ లో ప్రసంగిస్తూ... అత్యాధునిక డ్రై పోర్ట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.
శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు: మంతి వాకిటి శ్రీహరి
2036 ఒలంపిక్స్ సహా అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెంచే లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాపాలసీని అమలు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సు లో మంత్రి ప్రసంగిస్తూ...యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని ఏర్పాటు చేశామన్నారు. వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఫ్యూచర్ రెడీ టూరిజం పై మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం కీలకం కానుందని, 2047నాటికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటాను 10శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో "తెలంగాణ అనుభవాలు - వారసత్వం, సంస్కృతి - ఫ్యూచర్ రెడీ టూరిజం" అనే అంశంపై చర్చలో అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు కీలకోపన్యాసం చేశారు.
రెండు రోజుల్లో సుమారు 5.75 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టబడులు
నిన్నటి నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ రెండు రోజుల్లో సుమారు 5.75 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టబడులు వచ్చాయి. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించడానికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులను మాత్రమే రేపు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
-
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
రిటైర్ అయ్యాక ఏవీ రంగనాథ్ పొలిటికల్ ఎంట్రీ..క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమీషనర్! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు











Click it and Unblock the Notifications