Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Half-Day Schools: ఒంటిపూట స్కూల్స్ ఆ రోజు నుంచే -టెన్త్ పరీక్షా కేంద్రాల్లో..!

తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం కనిపిస్తోంది. ఉదయం పూట చలిగా ఉంటున్నా ఆ తర్వాత ఎండలు మండుతున్నాయి. మరోవైపు పదో తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు ఒంటిపూట బడులు (half-day schools) నిర్వహించాలనే డిమాండ్లు తల్లితండ్రుల నుంచి మొదలయ్యాయి. దీంతో అధికారులు కూడా ఒంటిపూట బడులపై నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన వెలువడింది.

తెలంగాణ (Telangana)లో మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. స్కూల్స్ కు హాజరయ్యే విద్యార్ధులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. అలాగే పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 5:00 వరకు క్లాసులు నిర్వహిస్తారు. అలాగే పరీక్షలున్నంతకాలం 10వ తరగతి స్పెషల్ క్లాసులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.

Telangana Schools to Go Half-Day Starting March 16 afternoon session for 10th class centres

మరోవైపు ఈ ఏడాది వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 12 నుంచి 2026-27 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభిస్తామన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలలు & డైట్ కళాశాలలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. మార్చి 20 తర్వాత అదనపు తరగతులు నిర్వహిస్తామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+