మీరు నిరుద్యోగులా..! : తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
మీరు నిరుద్యోగులా..! ఉద్యోగాల కోసం ప్రయత్నించి విసిగిపోయారా..! సొంత వ్యాపార ప్రయత్నాలు మొదలుపెట్టాలనుకుంటున్నారా..! అయితే తెలంగాణ ప్రభుత్వం మీ కోసమే ఓ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. యువత కోసం వినూత్న తరహాలో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. దీని ద్వారా లబ్ది పొందాలనుకునే అభ్యర్థులు పెద్దగా కష్ట పడాల్సిన పని కూడా లేదు. అతి సులభ మొత్తాలతో పొదుపుకు అవకాశం ఇచ్చి.. ఆ తర్వాత స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తోంది.

తెలంగాణ యువజన సంక్షేమ శాఖా మంత్రి మంత్రి పద్మారావు తెలిపిన వివరాల ప్రకారం :
ఇందులో సభ్యత్వం కావాలనుకునే వాళ్లు, 15 మంది వ్యక్తులు కలిసి ముందు ఒక గ్రూపుగా ఏర్పడాలి.
ఒక్కో వ్యక్తి రోజుకు 10 రూపాయల చొప్పున గ్రూపులో ఉన్న మొత్తం 15 మంది 6 నెలల పాటు డబ్బు జమ చేయాలి. ఈ లెక్కన అందరు కలిసి 6 నెలల్లో జమ చేసేది రూ. 27,000.
పొదుపు చేసిన మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున 15 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీనికోసం లబ్దిదారులు చేయాల్సిందేంటంటే.. స్వయం ఉపాధి కోసం తాము ఎలాంటి ఉద్యోగం చేయబోతున్నామనేది ప్రభుత్వ అధికారులకు క్షుణ్ణంగా వివరించాలి. అధికారులను ఒప్పించే బాధ్యత పూర్తిగా లబ్దిదారులదే.
మొదటి విడుత కింద రాష్ట్రంలో మొత్తం 10వేల గ్రూపులకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నామని, ఇందులో భాగంగానే జిల్లాకు 1000 గ్రూపుల చొప్పున అవకాశం కల్పించనున్నారు.
స్వయం సహాయక బృందాల తరహాలో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టుగా తెలిపారు మంత్రి పద్మారావు. ప్రతి ఏటా ఈ గ్రూపులను పెంచుకుంటూ పోతామని నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారాయన.












Click it and Unblock the Notifications