TSPSC: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ.. ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్-2.. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3..
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండనుంది. అలాగే అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు కండక్ట్ చేయననున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహిస్తారు.
563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయింది. మార్చి 14 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల మార్పుకు మార్చి 23 నుంచి మార్చి 27 వరకు అవకాశం ఇచ్చారు.రాష్ట్రంలో ఇప్పటికే టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఇందులో 2,629 స్కూల్ అసిస్టేంట్ లు కాగా.. 6,508 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు, 182 పీఈటీల పోస్టులకు పరీక్షల నిర్వహించనున్నారు. డీఎస్సీ సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.












Click it and Unblock the Notifications