వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొత్తులపై కసరత్తు: తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన చంద్రబాబు లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌‌లో టీటీడీపీ నేతలతో సమావేశమయ్యారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు.

కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు. 20 సీట్లలో 35 శాతం ఓటింగ్‌ పదిలంగా ఉందని వివరించారు. తెలంగాణలో టీడీపీ బలం చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.

Telangana TDP leaders meets chandrababu

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 36 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు తెదేపాకు తరగని ఆస్తని పేర్కొన్నారు. కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు.

Telangana TDP leaders meets chandrababu

పొత్తులపై చంద్రబాబు నిర్ణయిస్తారు

తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించినట్లు ఆ పార్టీ సినీయర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్.. టీడీపీపై చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చినట్లు రావుల పేర్కొన్నారు. లేక్‌ వ్యూ గెస్టు హౌజ్‌లో చంద్రబాబునాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు.

ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో పార్టీ తీసుకున్న కార్యక్రమాలను వివరించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అనుసరించే వ్యుహంపై చర్చ జరిగినట్లు చెప్పారు. పొత్తులపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని రావుల స్పష్టం చేశారు.

English summary
Telangana TDP leaders met TDP president Chandrababu Naidu on Saturday to discuss on alliance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X