హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో సోయిలో లేని తెలుగుదేశం పార్టీ..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్/తెలంగాణ‌: తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. ముంద‌స్తు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణంతో అన్ని పార్టీలు అప్ర‌మ‌త్తమై భ‌విశ్య‌త్ కార్య‌క్ర‌మాల‌కు రూప‌క‌ల్ప‌న చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు పొత్తుల‌తో క‌లిసి ముందుకు వెళ్లే అవ‌కాశాల‌ను చ‌ర్చించుకుంటున్నాయి. ఉమ్మ‌డి రాష్ట్రంలో చ‌క్రం తిప్పిన తెలుగుదేశం ప్ర‌స్తుతం తెలంగాణ‌లో నామ‌మాత్ర‌పు పాత్ర పోషిస్తుంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ముంద‌స్తు హ‌డావిడిగాని, పొత్తులపై చ‌ర్చ‌లు గాని, కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ గాని లేకుండా నిస్తేజంగా చూస్తోంది. పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్ర‌ద‌బాబు కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి అంత ప్రాధాన్య‌త ఇవ్వ‌డం త‌గ్గించ‌డంతో పార్టీ మ‌రింత దయ‌నీయ స్థితిలోకి వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో నైరాశ్యం..! నిరుత్సాహంలో నాయ‌కులు..!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో నైరాశ్యం..! నిరుత్సాహంలో నాయ‌కులు..!!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ బ‌ల‌హీన‌ప‌డుతోంది. పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఉప్పొంగిన ఉత్సాహంతో హాజ‌ర‌వుతున్న కార్య‌క్త‌ల‌కు క‌నీస భ‌రోసా క‌ల్పించే సాహ‌సం చేయ‌లేక‌పోతోంది రాష్ట్ర నాయ‌క‌త్వం. నేత‌లు పార్టీని వ‌దిలి వెళ్లిపోతున్నా క్యాడ‌ర్ ప‌టిష్టంగా ఉంద‌ని ప్ర‌తి స‌మావేశంలో గొంతెత్తి చెప్పుకునే నాయ‌కులు.. అదే క్యాడ‌ర్ ను బ్ర‌తికించుకునేందుకు మాత్రం కార్యాచ‌ర‌ణ రూపొందించుకోలేక పోతున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. టీటిడిపి అద్య‌క్షుడితో స‌హా ముఖ్య‌నేత‌ల తీరు మారకపోతే తెలంగాణాలో పార్టీ మ‌రింత నీర‌స‌ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

క్యాడ‌ర్ ఉంది..! క‌ద‌లిక తెచ్చే నాయ‌చ‌కుడే లేడు..!!

క్యాడ‌ర్ ఉంది..! క‌ద‌లిక తెచ్చే నాయ‌చ‌కుడే లేడు..!!

అంతేకాకుండా తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ కి ప‌టిష్ట‌ నాయ‌క‌త్వం తో పాటు మంచి క్యాడ‌ర్ ఉంది. తెలంగాణాలో టీఆర్ ఎస్ ప‌వ‌నాలు తారా స్థాయిలో వీస్తున్న త‌రుణంలో కూడా తెలుగుదేశం దాని మిత్ర ప‌క్షానికి రెండు పార్లుమెంట్, 20అసెంబ్లీ స్థానాలు ద‌క్కాయి. దీంతో తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో ఎంత ప‌టిష్టంగా ఉందో తేట‌తెల్ల‌మైంది. కాల క్ర‌మంలో పార్టీ నుండి ముఖ్య నేత‌లంద‌రూ వెళ్లిపోయినా కార్య‌క‌ర్త‌లు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారు. ఇంత‌టి అభిమానాన్ని చాటుకునే కార్య‌ర్త‌ల‌ను కాపాడుకోవ‌డానికి మాత్రం ప్ర‌స్తుత నాయ‌కత్వం ఎలాంటి ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. పార్టీ కార్య‌క్ర‌మాలు కూడా అంతంత మాత్రంగా నిర్వ‌హిస్తున్న‌ట్టు ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు చెప్ప‌క‌నే చెబుతున్నాయి.

పార్టీ కార్యాల‌యానికి రాని నేత‌లు..! ఎలా బ‌లోపైతం అవుతుందంటున్న కార్య‌క‌ర్త‌లు..!

పార్టీ కార్యాల‌యానికి రాని నేత‌లు..! ఎలా బ‌లోపైతం అవుతుందంటున్న కార్య‌క‌ర్త‌లు..!

తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకునేందుకు స‌మావేశాలు కూడా పెద్ద‌గా నిర్వ‌హించిన‌ట్టు క‌నిపించక పోవ‌డంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం చోటుచేసుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని ప‌ట్టాలెక్కించి ప‌రుగులు పెట్టించాల‌న్న ప‌ట్టుద‌ల జాతీయ అద్య‌క్షుడు చంద్ర‌బాబులో ఉంటే స‌రిపోద‌ని, రాష్ట్ర నాయ‌క‌త్వం కూడా అందుకు త‌గ్గ‌ట్టు గానే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని క్యాడ‌ర్ లో చ‌ర్చించుకుంటున్నారు.పార్టీ అద్య‌క్ష‌డు య‌ల్ ర‌మ‌ణ కార్య‌క్ర‌మాల‌ను రూపొందించ‌డంలో విఫ‌లం అవుతున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ప‌ల్లె ప‌ల్లెకు తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మం కూడా అంతంత మాత్రంగానే నిర్వ‌హించి ముగించారనే ఆరోప‌ణ‌లు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. చంద్ర‌బాబు స‌మావేశాల్లో భ‌విష్య‌త్ కార్య‌క్ర‌మాల గురించి ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చే ముఖ్య‌నేత‌లు ఆ త‌ర్వాత క‌నీస కార్య‌చ‌ర‌ణ రోపొందించ‌లేక పోతున్నార‌ని క్యాడర్ లో విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అన్నీ చంద్ర‌బాబు చూసుకోవాలంటే ఎలా..? స్థానికి నాయ‌క‌త్వం ఏంచేస్తున్న‌ట్టు..!!

అన్నీ చంద్ర‌బాబు చూసుకోవాలంటే ఎలా..? స్థానికి నాయ‌క‌త్వం ఏంచేస్తున్న‌ట్టు..!!

నెల‌కు ఒక సారి తెలంగాణా నేత‌ల‌తో స‌మీక్ష నిర్వ‌హిస్తాన‌ని చంద్ర‌బాబు ఇచ్చిన హామీని స్పూర్తిగా తీసుకుని పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు అభిప్రాయప‌డుతున్నారు. అదికార పార్టీ అస‌మ‌ర్ధ విధానాల‌ను ఎండ‌ట్ట‌డంలో ప్ర‌జా క్షేత్రంలో వ్యూహాలు ర‌చించాల‌ని, అందుకు రాష్ట్ర నాయ‌క‌త్వం అందుబాటులో ఉండాల‌ని క్యాడ‌ర్ కోరుతోంది. నిర్మాణాత్మ‌క కార్యాచ‌ర‌ణ రూపొందించుకుని ప్ర‌జాక్షేత్రంలో లో వెళ్తే ఫ‌లితాలు అనుకూలంగా ఉంటాయిని క్యాడ‌ర్ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేత‌ల స‌హ‌కారం స‌రైన రీతిలో ఉంటే క‌ద‌న రంగంలో క‌త్తి తిప్పేందుకు సిద్ద‌మ‌ని తెలుగు త‌మ్ముళ్లు తెగేసి చెప్తున్నారు. రాష్ట్ర నాయ‌క‌త్వం ఇప్ప‌టికైనా మేల్కొని ప‌క‌డ్బందీ వ్య‌హాలు ర‌చించి పార్టీ ప‌టిష్ట‌త‌కు క్రుషి చేయాల‌ని కోరుతోంది తెలంగాణా తెలుగుదేశం క్యాడ‌ర్.

English summary
telanhana tdp suffering from no clarity with future plans. ttdp suffering with no better leadership for ttdp.party chief chandrababu naidu not giving clarity so far on the alliance. so ttdp leaders are in much confusion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X