'రూ.500కు నాణ్యమైన మంచి చీర వచ్చేది, కేసీఆర్ పరువు పోగొట్టుకున్నారు'

బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చిన చీరలపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి. చీరల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాద్: బతుకమ్మ పండుగ సందర్భంగా ఇచ్చిన చీరలపై పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చీరలు మీ కూతురు కవితకు ఇవ్వాలని మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు.

పక్షాలు అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నాయి. చీరల విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది కదా అసలు బాగోతం?: బతుకమ్మ చీరల 'డీలింగ్' వెనుక ఇంత జరిగిందా!..

నాసిరకం చీరలు

నాసిరకం చీరలు

మహిళలకు బతుకమ్మ కానుక పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసే చీరలు నాసిరకంగా ఉన్నాయని, వాటితోపాటు ఆ పార్టీ కూడా నాసిరకమేనని తెలంగాణ ప్రదేశ్‌ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

రూ.500 పెడితే నాణ్యమైన చీరలు వచ్చేవి

రూ.500 పెడితే నాణ్యమైన చీరలు వచ్చేవి

రూ.500 పెడితే నాణ్యమైన చీరలు వచ్చేవని, నాసిరకం చీరలను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అగౌరవపరిచిందని, పరువు పోగొట్టుకున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన టిఆర్ఎస్‌ను ఇంటికి పంపే సమయం ఆసన్నమైందన్నారు. ఇందుకు కార్యకర్తలు సమాయత్తం కావాలన్నారు.

ఇప్పుడు, బర్రెలు, గొర్రెలు అంటున్నారు

ఇప్పుడు, బర్రెలు, గొర్రెలు అంటున్నారు

తెలంగాణలో సుమారు నాలుగు లక్షల మంది కాంగ్రెస్‌ కార్యకర్తలతో త్వరలోనే రాహుల్‌ గాంధీ ఫోన్‌లో సంభాషిస్తారని ఉత్తమ్ తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ఇప్పుడు చేపలు, గొర్రెలు, బర్రెలు అంటూ ప్రజలను మోసం చేస్తోన్నారన్నారు.

ఇదీ కేసీఆర్ నిజస్వరూపం

ఇదీ కేసీఆర్ నిజస్వరూపం

జయశంకర్‌ భూపాలపల్లిలో రైతులను పోలీసులు చెట్టుకు కట్టేశారని, ఖమ్మంలో మిర్చి రైతులను సంకెళ్లు వేసి తీసుకెళ్లడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిజస్వరూపానికి నిదర్శనం అన్నారు. రైతుల ఆగ్రహాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది నుంచి ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడిస్తామంటూ ప్రకటించారని, అది ఇప్పటి నుంచే ప్రారంభించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+