శ్రీరెడ్డి ఇష్యూ: నిర్లక్ష్యమేంటి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు
Recommended Video

Sri Reddy Leaks : Karate Kalyani Should Be Banned
న్యూఢిల్లీ/హైదరాబాద్: సినీ నటి శ్రీరెడ్డి వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్సీ) గురువారం స్పందించింది. ఈ కేసును సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్ఆర్సీ తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది.
సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించింది.

తెలుగు సినిమా పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అన్యాయం జరుగుతోందని, లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఆరోపిస్తూ ఇటీవల శ్రీరెడ్డి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎదుట అర్ధనగ్న నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ అంశంపై టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications