సులభ్ కాంప్లెక్స్ లోకి లాక్కెళ్ళి పదేళ్ళ బాలికపై అత్యాచారం.. రంగారెడ్డి జిల్లాలో దారుణం
మహిళలు, బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, బాలికల భద్రత ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దేశంలో నిత్యం మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా మానవ మృగాలు అమానవీయ ఘటనలకు పాల్పడుతూనే ఉన్నారు.అత్యాచారాలకు పాల్పడిన మృగాళ్లకు ఉరి శిక్షలు వేసినా కూడా కామాంధులలో మార్పు రావడం లేదు. ప్రతిరోజూ అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. లైంగిక వేధింపులు జరగని రోజు లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

బాలికను సులభ్ కాంప్లెక్స్ లోకి లాక్కెళ్లి అత్యాచారం
తాజాగా రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలికపై అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బాలికను సులభ్ కాంప్లెక్స్ లోకి లాక్కెళ్లి సదరు కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన కు సంబంధించిన వివరాలను చూస్తే రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్ పేట్ లో ఓ కుటుంబం పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. పండ్ల వ్యాపారం చేస్తున్న దంపతులకు 10 సంవత్సరాల కుమార్తె ఉంది. మంగళవారం వ్యాపారం చేస్తున్న క్రమంలో తల్లి కుమార్తెను పక్కన కూర్చో పెట్టుకుంది. ఆ తర్వాత తల్లి ఏదో పని మీద పక్కకు వెళ్లి వచ్చే లోపే బాలిక మాయమైంది.

పోర్న్ వీడియోలు చూపిస్తూ బాలికపై లైంగిక దాడి
బాలిక మీద కన్నేసిన సులభ్ కాంప్లెక్స్ లో పనిచేసే రవీందర్ అనే వ్యక్తి ఆ బాలికను సులభ్ కాంప్లెక్స్ లోకి లాక్కెళ్లాడు. బాలికకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. అతను ఏం చేస్తున్నాడో బాలిక అర్ధం చేసుకోలేకపోయింది. కానీ బాలికపై అత్యాచారానికి పాల్పడగా భరించలేకపోయిన బాలిక బాధతో కేకలు పెట్టింది. తనను వదిలిపెట్టాలని పెద్దగా ఏడ్చేసింది. ఇంతలో బాలిక కేకలు విన్న ఆమె తల్లి అక్కడకు పరుగెత్తుకు రాగా నిందితుడు పరారు కావడానికి ప్రయత్నం చేశాడు.

నిందితుడికి దేహ శుద్ధి చేసిన స్థానికులు .. పోలీసులకు అప్పగింత
దీంతో స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో నిందితుడిని అప్పగించారు. పదేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించిన సదరు కామాంధుడిని కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాదేది అత్యాచారానికి అనర్హమైన స్థలం అన్నట్టు సులభ కాంప్లెక్స్ లోని టాయిలెట్ ను కూడా అత్యాచారానికి వాడుకోవటం ఏ భయం లేని అతని స్వభావాన్ని స్పష్టం చేస్తుంది.
జనసంచారం ఉన్న చోట ఎలాంటి భయం లేకుండా అత్యాచారానికి పాల్పడటం ప్రతి ఒక్కరిని షాక్ కు గురి చేస్తుంది. అభం శుభం తెలియని 10 సంవత్సరాల బాలికను కూడా వదలకుండా రేప్ చెయ్యబోయిన కామాంధుడి తీరు అందరిలో ఆగ్రహానికి కారణం అవుతుంది. ఈ కేసులో బాలికపై అత్యాచారానికి యత్నించిన నిందితుడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications