మీ తాళం చెవి ఎక్కడ పెడుతున్నారు ? అతడు చూశాడంటే అంతే .. టెన్నిస్ కోచ్ ఆటకట్టించిన పోలీసులు
హైదరాబాద్ : అతడో దొంగ .. కొందరికి కౌన్సిలింగ్ ఇస్తే మంచిగా మారి, బుద్ధిగా పనిచేస్తారు. కానీ మరికొందరు కేటుగాళ్లు మాత్రం చేయి దొంగతనం వైపు చూస్తోంది. రాజమండ్రికి చెందిన కోమలి రామకృష్ణ కూడా అదే కోవకి చెందుతాడు. దొంగతనాలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చిన కేటుగాడు .. భాగ్యనగరంలో టెన్నిస్ కోచింట్ సెంటర్‌లో చేరాడు. చూస్తే బుద్ధిమంతుడిలగా ఉంటూ .. మళ్లీ దొంగతనాలు మొదలెట్టి .. ఊచలు లెక్కిస్తున్నాడు.

ఊరఫ్ .. రాజమండ్రి
రాజమండ్రి వై జంక్షన్‌కు చెందిన కోమలి రామకృష్ణ ఇంటర్ చేశాడు. ఇతని అమ్మమ్మకు కొడుకులు లేకపోవడంతో రామకృష్ణనే కుమారుడిలా పెంచింది. అయితే జులాయిగా తిరగడం, చోరీలకు పాల్పడటానికి అలవాటయ్యాడు. 2012లో రాజమండ్రిలో ఓ ఇంట్లో చోరీ చేసి .. జువైనల్ హోమ్‌కు కూడా వెళ్లాడు. అయినా అతని తీరు మారలేదు. దొంగతనాలు చేస్తూ వచ్చాడు. రాజమండ్రి త్రీ టౌన్, ధవళేశ్వరం, రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో ఆరు కేసులు ఉన్నాయి. జైలుశిక్ష అనుభవించి మకాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు మార్చాడు.

సిటీలో మకాం ..
హైదరాబాద్ నిజాంపేటలోని బంధువుల ఇంట్లోకి చేరాడు. కూరగాయాలు విక్రయిస్తూ .. చోరీలు చేశాడు. వర్టెక్స్ అపార్ట్ మెంట్ ఎదుట ఓ ఇంట్లో టీవీ, మిక్సీ, బైక్ దొంగతనం చేశాడు. పోలీసులు అరెస్ట్ చేసి .. జైలుకు పంపించారు. తిరిగి వచ్చిన మళ్లీ తన మకాన్ని జలవాయు విహార్ కు మార్చాడు. అక్కడ టెన్సిస్ అసిస్టెంట్ కోచ్ గా పనిచేస్తున్నాడు. కోచింగ్ సెంటర్ లో చేరిన వక్రబుద్ధి మారలేదు. మళ్లీ దొంగతనాలు ప్రారంభించాడు. పరిచయమున్న వారి ఇళ్లకు వెళుతూ .. తాళం చెవి ఎక్కడ పెడుతున్నారో గమనించేవాడు. తర్వాత వారి లేని సమయం చూసి చోరీ చేసేవాడు.

బాలుడి ఇంట్లో కూడా ...
ఇదేవిధంగా టెన్నిస్ కోచింగ్ వచ్చే బాలుడి ఇంటిపై పాటించి .. మళ్లీ అరెస్టయ్యాడు. సర్దార్ పటేల్ నగరర్ కు చెందిన డాక్టర్ తన కుమారుడిని కోచింగ్ అకాడమీలో చేర్చించాడు. బాలుడి మంచిగా మాట్లాడే రామకృష్ణ .. ప్రతిరోజు ఇంట్లో దిగబెట్టేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న ఊరెళ్తున్నామని బాలుడు రామకృష్ణకు చెప్పాడు. వారి యాత్రకు వెళ్లాక .. 27న ఇంట్లో చోరీ జరిగింది. బాలుడి వద్ద నుంచి ఇంటి తాళం చేవి కొట్టేసి దర్జాగా దొంగతనం చేశాడు. యాత్రకు వెళ్లిచ్చిన డాక్టర్ తమ ఇంట్లో చోరి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో కేసు విచారణ సమయంలో .. రామకృష్ణ కనిపించాడు. చోరీ గురించి ఆరాతీస్తే దొంగతనం చేసినట్టు అంగీకరించాడు. అతడి నుంచి 5 లక్షల విలువైన బంగారం, వెండి నగలు, టీవీ, మిక్సీ, అపాచీ బైక్ స్వాధీనం చేసుకొని .. రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications