అరికెపూడి గాంధీ ఇంటివద్ద ఉద్రిక్తత... బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రచ్చ!

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపిస్తున్నానని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన దుమారం బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఘర్షణలకు కారణమైంది. పాడి కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు కాస్త దాడులదాకా వెళ్ళాయి. హౌస్ అరెస్టులు, అరెస్టులతో తెలంగాణాలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.

అరికెపూడి గాంధీ ఇంటివద్ద బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి గాంధీ తన అనుచరులతో వెళ్లి ఆందోళన నిర్వహించి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేయగా, నేడు అరికెపూడి గాంధీ ఇంటికి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో పాటు, ఆందోళన చెయ్యటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Tension at Arekapudi Gandhi house BRS vs Congress ruckus police arrests

గాంధీ ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు
చర్యకు ప్రతిచర్య ఉంటుందని, తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారిని వదిలిపెట్టబోనని ఈరోజు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి తీరుతానని పాడి కౌశిక్ రెడ్డి నిన్ననే పేర్కొన్నారు. ఈ క్రమంలో నేడు అధిష్టానం పిలుపుమేరకు పెద్ద ఎత్తున అరికెపూడి గాంధీ ఇంటి వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఆయన ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై బిఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు.

బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. పోలీసులతోనూ వాగ్వాదం
దీంతో బి ఆర్ ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక అరికెపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా బి ఆర్ ఎస్ శ్రేణులు మోహరించడంతో మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రంగంలోకి దిగారు. దీంతో బిఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు
ఇక ఆరికెపూడి గాంధీ ఇంటి వద్ద బయట గాంధీ డౌన్ డౌన్ అంటూ ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను, నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ మరోవైపు బిఆర్ఎస్ ఆందోళనలతో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద హై టెన్షన్ చోటుచేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+