అరుణాచలం - తిరుమల, పంచారామాలకు ప్రత్యేక బస్సులు-ప్యాకేజీ ఇలా..!!
కార్తీక మాసంలో ప్రముఖ ఆలయాల సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ నెలలో రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి స్పెషల్ ప్యాకేజీలతో ఈ బస్సులను నడుపుతోంది. రాష్ట్రం నుంచి అరుణాచలం కు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, అరుణాచలం గిరి ప్రదిక్షణతో పాటుగా తిరుమల శ్రీవారి దర్శనంతో సహా పలు ఆలయాల సందర్శనకు వీలుగా ప్యాకేజీ ఖరారు చేసారు. అటు మరిన్ని ప్రాంతాల నుంచి పంచారామాల సందర్శనతో పాటుగా అరుణాచలం వరకు యాత్ర.. ప్యాకేజీలు ప్రకటించారు.
కార్తీక మాసం వేళ భక్తులు సౌలభ్యం మేరకు తమిళనాడులోని సుప్రసిద్ధ శైవ క్షేత్రం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేపట్టేందుకు వీలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆధ్యాత్మిక యాత్రగా అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. నవంబరు 2న పరిగి, 7వ తేదీన నిర్మల్ నుంచి అరుణాచలం వరకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. 7న నిర్మల్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్మల్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది. అరుణాచలంలో కార్తిక దీపాలు వెలిగించడంతో పాటు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేపట్టేందుకు అవకాశముంటుంది. మార్గం మధ్యలో కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, తమిళనాడులోని లక్ష్మీదేవి బంగారు ఆలయం దర్శించుకోవచ్చు. అరుణాచలేశ్వరుడి దర్శనం అనంతరం కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలకు వెళ్తారు.

తిరుమలలో సర్వదర్శన టోకెన్లలో కేటాయించిన సమయం ఆధారంగా స్వామివారిని దర్శించుకు నేలా ఏర్పాట్లు చేశారు. ఈలోగా తిరుపతి, గోవిందరాజులు, అలివేలు మంగ దర్శనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, పలు ఆలయాల సందర్శన పూర్తి చేయవచ్చు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఒక్కొక్కరికీ రూ.6,300 చొప్పున టికెట్ ధర ఉంటుందని వెల్లడించారు. ఇక... పరిగి నుంచి బయల్దేరే ప్రత్యేక బస్సులు పంచారామాల సందర్శన చేసుకొని 4న తిరిగి చేరుకుంటారు. టికెట్ రూ 2500 గా ఖరారు చేసారు. మరో ప్యాకేజీలో 3న పరిగి నుంచి బస్సు బయల్దేరి కాణి పాకం, వేలూరి గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి ప్రదక్షిణ, దర్శనం ఉంటుంది. తిరిగు ప్రయాణంలో జోగులాంబ పీఠం దర్శించుకొని 6న పరిగి చేరుకుంటారు. టికెట్ ధర రూ 2 వేలుగా నిర్ణయించారు. ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఇదే తరహా ప్యాకేజీలను అమలు చేస్తున్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications