ఉచిత బస్సు ప్రయాణంతో ఆ ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ కీలక ప్రతిపాదన.. వారికి పండుగే!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్న టి జి ఎస్ ఆర్ టి సి ప్రస్తుతం తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో పనిచేసే కండక్టర్ పోస్టులలో ఈ సమస్య అధికంగా ఉంది. దీంతో సంస్థ అనేక కార్యకలాపాలను నిర్వహించడానికి తాత్కాలిక సర్దుబాటు చేసి సిబ్బందిని సమకూర్చుకుంటుంది.

ఆర్టీసీలో కండక్టర్ ల కొరత
ప్రస్తుతం ఆర్టీసీ బస్సులలో ఉన్న కండక్టర్ల సమస్యను అధిగమించడం కోసం టిజీఎస్ ఆర్ టి సి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే భారీగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2059 మంది కండక్టర్ల కొరత ఉంది. మార్చి 2026 నాటికి మరో 140 మంది ఉద్యోగ విరమణ చేస్తారు.

TGSRTC good news Another key proposal of RTC to fill conductors with the effect of free bus travel

ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన సిబ్బంది కొరత
ఆర్టీసీలో కండక్టర్ల నియామకం జరిగి 10 సంవత్సరాలు అయిపోయింది అప్పటినుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ చేసే వారే కానీ కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారు లేకపోవడంతో ప్రస్తుతం ఆర్టీసీ కొరతను ఎదుర్కొంటుంది. ఇక ఇవి మాత్రమే కాకుండా మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేయడంతో ఇటీవల ఆర్టీసీ బస్సులలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్యను కూడా పెంచింది.

మంత్రి దృష్టికి కండక్టర్ ల భర్తీ అంశం
కొత్తగా ఆర్టీసీ లోకి బస్సులు వచ్చి చేరుతున్న క్రమంలో వీటి నిర్వహణకు అదనంగా 1009 మంది కండక్టర్లు అవసరమని ఆర్టీసీ గుర్తించింది. ఈ లెక్కల ప్రకారం తెలంగాణ ఆర్టీసీకి 3208 మంది కండక్టర్లు అవసరం ఉంది. ఇక ఈ నేపథ్యంలో వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం ఇటీవల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్ళింది.

ఆర్టీసీలో బాగా తగ్గిన సిబ్బంది.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు
దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఆర్టీసీ. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వేగవంతం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తుంది. ఇక ఆర్టీసీలో ప్రస్తుతం కండక్టర్లు మాత్రమే కాక ఇతర సిబ్బంది కొరత కూడా కనిపిస్తుంది. 2014 - 2015 లో ఆర్టీసీలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 56 వేల 740 గా ఉండేది కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 38715 కు పడిపోయింది దీంతో సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది.

వారికి తీపి కబురు
ఇక ఇప్పటికే ఇటీవల ప్రభుత్వం వెయ్యి డ్రైవర్ పోస్టులకు 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది ప్రస్తుతం ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. మొత్తంగా ఆర్టీసీలో పోస్టులు భర్తీకి ఒక అడుగు పడటం ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక తీపి కబురు అని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+