టీజీఎస్ఆర్టీసీ శుభవార్త: త్వరపడండి..!!
TGSRTC: విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. గుడ్ న్యూస్ వినిపించింది. టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నడిచే ఐటీఐల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని వెల్లడించింది. ఇందులో చేరదలిచిన విద్యార్థులు వెంటనే తమ దరఖాస్తులను దాఖలు చేయాలని సూచించింది. జూన్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
టీజీఎస్ఆర్టీసీకి సొంతంగా రెండు ఐటీఐలు ఉన్నాయి. ఒకటి- హకీంపేట్, మరొకటి- వరంగల్ కేంద్రంగా పని చేస్తోన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం కోసం ఈ రెండు ఐటీఐల్లో అడ్మిషన్లు మొదలయ్యాయి. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయి.

రెండు సంవత్సరాల మోటార్ మెకానిక్ వెహికల్ ట్రేడ్- 48, ఒక సంవత్సరం మెకానిక్ డీజిల్ ట్రేడ్‌లో 24 సీట్లను ఈ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనుంది టీజీఎస్ఆర్టీసీ. ఈ రెండింట్లో అడ్మిషన్లు పొందడానికి విద్యార్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రెండు సంవత్సరాల పెయింటర్- 20, ఒక సంవత్సరం వెల్డర్ ట్రేడ్‌లో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ట్రేడ్‌లల్లో చేరడానికి విద్యార్థులు 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
ఆయా ట్రేడ్‌లల్లో చేరడానికి అర్హత గల విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్‌లో తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వారు వెబ్ సైట్ https://iti.telangana.gov.inను సందర్శించాలి. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు.
విద్యార్థులకు శుభవార్త!! హైదరాబాద్, వరంగల్‌లోని #TGSRTC ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ (https://t.co/FsZILFLzax) లో దరఖాస్తు చేసుకోవాలి. మోటార్… pic.twitter.com/NhjRx0QZ4D
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) May 27, 2024
నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ, బంగారు భవిష్యత్ అందించడంతో పాటు తక్కువ వ్యవధిలో వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులు ఈ ఐటీఐల్లో తరగతులను నిర్వహిస్తారని తెలిపారు.
ఆయా ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు చదువు పూర్తయిన తరువాత తాము కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ హకీంపేట్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611ను సంప్రదించాలని కోరారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications