టీజీఎస్ఆర్టీసీ మరో కొత్త సంచలన రికార్డ్..మూడు రోజుల్లోనే 1.4కోట్ల మంది ప్రయాణం!

టీజీఎస్ఆర్టీసీ దసరా పండుగ సందర్భంగా మరో కొత్త సంచలన రికార్డ్ నమోదు చేసింది. అక్టోబర్ నెలలో ఊహించని విధంగా మూడు రోజుల్లోనే నయా రికార్డ్ నమోదు చేసింది. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సోమవారం అధికారులతో జూమ్ సమీక్ష నిర్వహించి ఈ వివరాలను వెల్లడించారు.

9, 10, 11 తేదీల్లో మొత్తం మూడు రోజుల్లోనే 1.4 కోట్ల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించారు. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక సంఖ్య. ఇదే విషయాన్ని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళలకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది. ఈ దసరా సమయంలో మహిళలు రోజుకు సగటున రూ.13.73 కోట్ల మేర ఆదా చేసుకున్నారన్నారు.

TGSRTC Sets New Record 1 4 Crore Passengers trips in Three Days in dussehra Women Save Rs 13 73 Crore

గతేడాది ఇదే కాలంలో రోజుకు రూ.13.02 కోట్లు ఆదా కాగా, ఈ సారి మరింత పెరిగిందని పేర్కొన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ తదితర సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని స్పష్టం చేశారు.పండుగ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో కూడా అదనపు బస్సులు నడపాలని ఎండీ ఆదేశాలు ఇచ్చారు. తిరుగు ప్రయాణాలకు అక్టోబర్ 25, 26 తేదీల్లోనూ ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తారు.

మొత్తంగా దసరా సీజన్‌లో సుమారు 7,000 ప్రత్యేక బస్సులు నడపనున్నారు.గత ఏడాది దసరా తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులు నడిపితే, ఈ సారి 1,417 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చారు. అంటే గతేడాదితో పోలిస్తే 495 బస్సులు అదనం. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సర్వీసులను నిరంతరం పర్యవేక్షించాలని ఎండీ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ వంటి ప్రాంతాల నుంచి రాష్ట్రం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీసం 30 మంది ఒక బృందంగా బుక్ చేసుకుంటే వారి కాలనీ, హాస్టల్ లేదా గేటెడ్ కమ్యూనిటీ వద్దకే బస్సు వచ్చి పికప్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు.

హైదరాబాద్-విజయవాడ NH-65 విస్తరణపై శుభవార్త చెప్పిన మంత్రి!
హైదరాబాద్-విజయవాడ NH-65 విస్తరణపై శుభవార్త చెప్పిన మంత్రి!

ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. అవసరమైతే 040-69440000, 040-23450033 నంబర్లలో కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. దసరా పండుగ సందర్భంగా ప్రజలు సురక్షితంగా, సౌకర్యవంతంగా స్వగ్రామాలకు చేరుకునేలా టీజీఎస్ఆర్టీసీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇలా అన్ని వసతులు కల్పిస్తున్న కారణంగానే రికార్డ్ ప్రయాణాలు నమోదు అవుతున్నాయని ఆర్టీసీ ఎండీ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+