తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర - నోటిఫికేషన్..!!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీలో కొలువులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఆర్టీసీ మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు TSLPRB ఉద్యోగ నోటిఫికేషన్ ను విడు దల చేసింది. 198 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో రవాణా కార్యకలా పాల పర్యవేక్షణ తో పాటుగా వాహనాల ఫిట్‌నెస్, మెకానికల్ పనుల పర్యవేక్షణ కోసం మెకానికల్ సూపర్ వైజర్స్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులు ఉన్నాయి. అర్హతలు.. ఎంపిక విధానం నోటిఫికేషన్ లో వివరించారు.
తెలంగాణ ఆర్టీసీ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టుల్లో రవాణా కార్యకలా పాల పర్యవేక్షణకు సంబంధించి 84 ట్రాఫిక్ సూపర్ వైజర్స్ ట్రైనీలు (టీఎస్‌టీ), వాహనాల ఫిట్ నెస్, మెకానికల్ పనుల పర్యవేక్షణ కోసం 114 మెకానికల్ సూపర్ వైజర్స్ ట్రైనీ (ఎంఎస్‌టీ) పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 30, 2025వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా జనవరి 20, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 27,080 నుంచి రూ.81,400 వరకు జీతంగా చెల్లిస్తారు. జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లుగా నిర్దారించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు TSLPRB అధికారిక వెబ్‌సైట్ సందర్శించి డిసెంబరు 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, అప్లికేషన్ ఫీజు, పరీక్షా విధానం, సిలబస్, ఫిజికల్ టెస్టులు వంటి ఇతర వివరాలను వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులకు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీలో అర్హత ఉంటే సరిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటుగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ దిశగా కసరత్తు చేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.












Click it and Unblock the Notifications