తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
ఖమ్మం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఖమ్మం పర్యటనలో ఉండగా ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తమ్మినేని ఆరోగ్యంగా ఉన్నారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు వెల్లడించాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలసుకున్నారు.

కాగా, తమ్మినేని వీరభద్రం గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన స్వగ్రామం తెల్ధారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫెక్షన్ తోపాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రెఫర్ చేశారు.
ఈ నేపథ్యంలో అంబులెన్స్ లో తమ్మినేని వీరభద్రంను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు. తాజాగా, మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో ఆందోళన నెలకొంది. అయితే, వైద్యులు మాత్రం రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, తమ్మినేని ఆరోగ్యం బాగుందని స్పష్టం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications