భారతదేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం.. ఎక్కడో చెప్పిన మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రగతిపదంలో ముందుకు తీసుకువెళ్లడానికి, హైదరాబాద్ ను విశ్వవిఖ్యాత నగరంగా తీర్చిదిద్దడానికి శత విధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్ మణిహారంలో మరో అద్భుతం చేరబోతుందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
హైదరాబాద్ నగరంలో భారతదేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం నిర్మిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడాలో భారతదేశంలోనే అతిపెద్ద అక్వేరియం మరియు ఏవియరీని నిర్మిస్తున్నామంటూ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని, తెలంగాణ ప్రజలు అతి త్వరలో ఆహ్లాదకరమైన, అద్భుతమైన టన్నెల్ అక్వేరియంను చూడబోతున్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

అయితే ఈ ట్వీట్ కి ముందు ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా మంత్రి కేటీఆర్ కు టన్నెల్ అక్వేరియం గురించి సూటిగా ఒక ప్రశ్నను సంధించారు. మన రాష్ట్రంలో ఉన్న అద్భుతమైన సరస్సుల కింద టన్నెల్ అక్వేరియం ఏర్పాటు చేయడం సాధ్యం కాదా అంటూ మంత్రిని ప్రశ్నించిన నెటిజన్, తెలంగాణకు బహుమతిగా ఒక టన్నెల్ అక్వేరియం ఇవ్వండి కేటీఆర్ గారు అంటూ ప్రశ్నించారు.
ఇక నెటిజన్ పోస్ట్ చూసిన మంత్రి కేటీఆర్ అక్వేరియం నిర్మాణ దశలో ఉందని త్వరలోనే అందుబాటులోకి వస్తుందని నెటిజన్ కు సమాధానం ఇస్తూ భారతదేశంలోనే అతిపెద్ద టన్నెల్ అక్వేరియం ఇది అని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పట్ల సదరు నెటిజన్ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, ఈ ట్వీట్ చూసిన పలువురు థాంక్యూ కేటీఆర్ గారు అంటూ ట్వీట్లు చేస్తున్నారు.
We are building India’s largest Aquarium and Aviary at Kothwalguda. Work is in progress
— KTR (@KTRBRS) April 17, 2023
Will have @arvindkumar_ias and @HMDA_Gov share pictures and details https://t.co/Jm1vs5EM2p
తెలంగాణ ప్రజలు ఏదైనా మనసులో అనుకుంటే, వారి మనసులోకి వచ్చీ రాకముందే మంత్రి కేటీఆర్ చేసి చూపిస్తున్నారని ఆయనను తెగ పొగుడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజధాని హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచం దృష్టిని అనేక అంశాలలో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, ఇక తాజాగా అతిపెద్ద టన్నెల్ అక్వేరియం కూడా ముందు ముందు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications