పబ్జీ ఆడుతూ కారులోనే ఉండిపోయిన బాలుడు .. ఊపిరాడక మృతి

ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే లోపు రోజూ ఏ వార్త చూసినా చూడకున్నా పబ్జీ గురించి మాత్రం తప్పక చూడాల్సి వస్తుంది. పబ్జీ ప్రాణాంతకంగా మారుతుంది. యువత భవిత నాశనం చెయ్యటమే కాకుండా, చిన్నారుల ప్రాణాలను సైతం హరిస్తుంది . ప్రతినిత్యం దేశంలో ఎక్కడో ఒక చోట పబ్జీ వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. చాలా పాపులర్ అయిన ఆన్‌లైన్‌ గేమ్‌ పబ్జీ గేమ్ కు సంబంధించి రోజుకో ఘటన ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.

పబ్జీ ఆడుతున్న బాలుడ్ని కారులోనే మరచి వెళ్ళిన తల్లిదండ్రులు

పబ్జీ ఆడుతున్న బాలుడ్ని కారులోనే మరచి వెళ్ళిన తల్లిదండ్రులు

పబ్జీఆడుతూ కారులో ఉండిపోయిన బాలుడు మృతి చెందిన విషాదకర ఘటన తెలంగాణా రాష్ట్రంలో చోటు చేసుకుంది . సిరిసిల్ల జిల్లాలో నిన్న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వేములవాడ పట్టణంలో ఒక వివాహ వేడుకకు తమ కుమారుడు తొమ్మిదేళ్ళ చరణ్ ను తీసుకుని వెళ్ళారు . ఈ సందర్భంగా ఫోన్ లో పబ్ జీ గేమ్ లో లీనమై పోయి ఆడుకుంటున్న బాలుడు తల్లిదండ్రులు కారు దిగి వెళ్ళినప్పటికీ తాను కారులోనే ఉండిపోయాడు .

పబ్జీ ఆటలో పడి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన విషయాన్ని గమనించని బాలుడు

పబ్జీ ఆటలో పడి తల్లిదండ్రులు వెళ్ళిపోయిన విషయాన్ని గమనించని బాలుడు

పబ్జీ ఆటలో పడి తల్లిదండ్రులు వెళ్తున్న విషయాన్ని గమనించలేదు . ఈ క్రమంలో కారు డోర్ ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. కొద్దిసేపటికి పబ్జీ ఆడుతున్న బాలుడు ఊపిరి ఆడకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అయితే పెళ్లి పనుల్లో పడిపోయిన కుటుంబ సభ్యులు చరణ్ ను గమనించలేదు. కారు లోనే ఉండిపోయిన బాలుడు చరణ్ ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

ఊపిరాడక మృతి చెందిన బాలుడు . కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు

ఊపిరాడక మృతి చెందిన బాలుడు . కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు

తరువాత కొద్దిసేపటికి కుమారుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బంధువులు పెళ్లి పనులు అటుంచి బాబు కోసం వెతకటం ప్రారంభించారు . కారులో చరణ్ ను గుర్తించి ఆసుపత్రికి తరలించారు అప్పటికే పిల్లాడు కోమాలోకి వెళ్లాడని వైద్యులు తెలిపారు. ఆస్పత్రికి వెళ్ళిన కొద్దిసేపటికే బాలుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. దీంతో పబ్ జీ గేమ్ తమ పిల్లాడి ప్రాణాలు తీసిందని బాధిత కుటుంబం, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+