హెల్త్ వార్నింగ్ ఇస్తున్న చలి.. వందలో 15 మందికి ఆ జబ్బు!

తెలుగు రాష్ట్రాలలో చలి బాగా పెరిగింది. చలికాలంలో వాతావరణ మార్పులు, కాలుష్యం తదితర కారణాలతో ప్రస్తుతం ఒక తీవ్ర సమస్య తెలుగు రాష్ట్రాలలో ప్రజలను భయపెడుతోంది. వైరస్, బ్యాక్టీరియాతో ఊపిరితిత్తుల సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రస్తుతం దగ్గు వస్తే చాలాకాలం పాటు తగ్గని పరిస్థితి నెలకొంది. ఇక చిన్నారులను, వృద్ధులను చలి కారణంగా వస్తున్న న్యుమోనియా పట్టిపీడిస్తోంది.

ఎక్కడ చూసినా పెరుగుతున్న న్యుమోనియా కేసులు
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా దగ్గు కేసులు పెరుగుతున్నాయి. దగ్గు సిరప్ తాగినా, ఎన్ని మందులు వేసుకున్న తగ్గని పరిస్థితులలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు చాలామంది న్యుమోనియా తో బాధపడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు రెట్టింపు అవుతాయని, రెండేళ్లలోపు పిల్లలు, తక్కువ బరువుతో పుట్టిన వారు, పోషకాహార లోపం ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారని చెబుతున్నారు.

The cold that is giving health warnings 15 out of a hundred people get pneumonia

చలి దెబ్బ.. వృద్ధులకు న్యుమోనియా
చలి కారణంగా ఊపిరితిత్తులు బిగుసుకుపోయి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారని చెబుతున్నారు. చలి నుండి రక్షణ కల్పించడం, వెచ్చని దుస్తులు, మాస్కులు ధరించడం ద్వారా కొంతమేర ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు. ఇక వృద్ధులు కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే కారణంతో న్యుమోనియా బాధితులుగా మారుతున్నారని చెబుతున్నారు.

ఈ సమస్యలు ఉంటే న్యుమోనియా తీవ్రతరం
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు కూడా న్యుమోనియా బారిన పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఈ సీజన్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని, సకాలంలో చికిత్స చేయకపోతే దారుణ పరిస్థితిని ఎదుర్కొంటారని చెబుతున్నారు.న్యుమోనియా వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇలా మూడు రకాలుగా ఊపిరితిత్తులపైన దాడి చేస్తుందని చెబుతున్నారు.

వైద్యులతో చికిత్స ఉత్తమం
తీవ్రంగా జ్వరం రావడం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి ప్రధాన లక్షణాలతో ఇది వస్తుందని, వైద్యులను సంప్రదించి సరైన చికిత్స చేయించుకుంటేనే దీని నుండి బయట పడతామని చెబుతున్నారు. శీతాకాలంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే, చలి నుండి కాపాడుకోకపోతే పరిస్థితి తీవ్రతరం అవుతుందని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+