గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163G.. ఆ ప్రాంతాలకు మహర్దశ!
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, మహారాష్ట్ర లను కలుపుతూ నిర్మాణం చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జి పనులలో దూకుడు పెరిగింది. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని తెలుగురాష్ట్రాలు వేగవంతం చేశాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఎక్కడికక్కడ భూసేకరణ చేసి దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా పంటపొలాల గుండా నిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే వ్యవసాయ భూములలో నుంచి వెళుతూ మెరుగైన రవాణాను అందిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు.
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (163G) కోసం హన్మకొండలో భూసేకరణ
వరంగల్ నుండి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు నిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ నిర్మాణ వేగాన్ని పెంచుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలో చేపడుతున్న గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (163G) నిర్మాణ పనుల పురోగతిపై హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేషనల్ హైవేస్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పరిహారం చెల్లిస్తే పనులలో దూకుడు
ఈ సందర్భంగా 163G గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ పూర్తైన అంశాలు, రైతులకు పరిహారం చెల్లింపు పరిస్థితి, అలాగే రహదారి నిర్మాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలపై కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పరిహారం చెల్లింపులు చేసి, భూమిని హైవే నిర్మాణానికి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు.
నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ హైవే
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రవి, నేషనల్ హైవే వరంగల్ విభాగం ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. మరోవైపు వరంగల్ జిల్లాలో కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తయింది. ఇది నాలుగు లైన్ల యాక్సిస్ కంట్రోల్ హైవే గా ఉంది. దీని నిర్మాణంలో కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్నవాటిని అప్గ్రేడ్ చేయటం జరుగుతుంది.
రవాణాకు, ఆర్ధిక వృద్ధికి ప్రోత్సాహం
ఇది వస్తు రవాణాను మెరుగు పరచటంతో పాటు, ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించటం జరుగుతుంది. ఇది ఏపీ, తెలంగాణాల మధ్య ప్రయాణ సమయం తగ్గిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది, తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుంది.












Click it and Unblock the Notifications