విమానంలో ఆ పనిచేస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రయాణికుడు..
విమాన ప్రయాణంలో సిగరెట్ తాగడం వంటివి నిషేదం. అయితే, చాలామందికి ఈ విషయం తెలుసు. అయినా, ఒక్కోసారి కొందరు సెక్యూరిటీల కళ్లుగప్పి ఇలాంటి పనులకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఓ యువకుడు సెక్యురిటీ కళ్లు గప్పి మరీ విమానంలోకి సిగరెట్‌లను తెచ్చుకున్నాడు. అంతటితో ఆగకుండా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సిగరెట్ తాగి విమాన సిబ్బందికి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఇబ్బందులను కొని తెచ్చుకున్నాడు. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిన్న (ఆదివారం) చోటుచేసుకుంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి... అహ్మద్ అనే యువకుడు హైదరాబాద్‌లో గత కొంతకాలంగా నివసిస్తున్నాడు. అయితే, తను ఆబుదాబీకి వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ 6ఈ-1408 సర్వీస్ ఫ్లైట్‌ను ఎక్కాడు. అయితే విమానం టేకాఫ్ తీసుకునే క్రమంలో అహ్మద్ దొంగచాటు సిగరెట్ తాగాడు. ఆ విషయాన్ని ఎయిర్ హోస్టస్ గమనించింది.

దీంతో వెంటనే వెళ్లి పైలట్‌కు ఈ విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పింది. దీంతో అప్రమత్తమైన భద్రతాధికారులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, ఆ యువకున్ని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగిచి, అతనిపై కేసు ఫైల్ చేశారు. అయితే, ఎయిర్‌పోర్టులో ప్రతి విషయాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించే అధికారుల నుంచి కళ్లుగప్పి ఆ వ్యక్తి సిగరెట్‌తో ఎలా ప్రవేశించాడనే విషయంపై చాలామంది చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications