Egg Price: కొండెక్కిన కోడి గుడ్డు..!
కోడి గుడ్డు ధర కొండెక్కింది. గుడ్ల ధర భారీగా పెరిగింది. చిల్లర ఒక్కొ కోడి గుడ్డు రూ.7 నుంచి రూ.7.50 పలుకుతోంది. హోల్ సేల్ లో అయితే ఒక్కో గుడ్డు రూ.6.50 పలుకుతోంది. 30 గుడ్లు గల ట్రే ధర రూ.195కు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం 100 గుడ్లకు హోల్‌సేల్ ఫారం రేటు రూ.620గా ఉండగా.. మార్కెట్‌లో 100 గుడ్లు రూ.650 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. రిటైల్ ధరలు మరింత పెరిగి 100 గుడ్లు రూ.700కి చేరింది. పలు చోట్ల రూ.720 కూడా అమ్ముతున్నారు. సాధారణంగా చలికాలం కోడి గుడ్ల ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
చలి తీవ్రత పెరిగితే వేడి కోసం గుడ్లు ఎక్కువగా తింటారని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన చలి ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ గుడ్ల వినియోగం పెరుగుతోంది. దీంతో తెలంగాణ, ఏపీ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కోడి గుడ్లు వెళ్తుంటాయి. దీంతో పాటు ఈ డిసెంబర్ లో క్రిస్మస్ ఉంటుంది. ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకలు ఉంటాయి. క్రిస్మస్, డిసెంబర్ 31న కేక్ లు భారీగా కట్ చేస్తారు. అందుకే బేకరీలు భారీగా కేక్ లు తయారు చేస్తున్నాయి. కేక్ ల తయారీలో గుడ్లు ఉపయోగిస్తారు.

అందుకే కోడి గుడ్ల కిరాకీ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కేక్‌లకు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు వివరిస్తున్నారు. కోడి గుడ్ల ధరలు పెరుగుతుంటే.. చికెన్ ధరలు మాత్రం సాధారణంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ స్కీన్ లెస్ చికెన్ ధర రూ.230వరకు పలికుతోంది. ఇటు ఉల్లి ధరల కూడా భారీగా పెరిగాయి. రిటైల్ లో కిలో ఉల్లి రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. హోల్ సేల్ లో కిలో ఉల్లి రూ.50 నుంచి రూ.60 చేరింది.
మరోవైపు ఇన్ని రోజులు ఎక్కువగా టమాటా ధర భారీగా పడిపోయింది. ప్రస్తుతం కిలో టమాటా రూ.20 నుంచి రూ.30 విక్రయిస్తున్నారు. 15 రోజుల క్రితం కిలో టమాటా రూ.50 పలికింది. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయ ధరలు సాధారణంగానే ఉన్నాయి.












Click it and Unblock the Notifications