Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య పంచాయితీ ముగిసినట్లేనా.. సుప్రీం ఏం చెప్పిందంటే..!

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుల విషయంలో వివాదం తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన పది బిల్లులను క్లియర్ చేసేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా.. పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలిపినట్లు గవర్నర్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.

ప్రస్తుతం గవర్నర్‌ వద్ద పెండింగ్‌ బిల్లులు లేనందున కేసు పరిష్కారం అయినట్లు సీజేఐ ధర్మాసనం ప్రకటించింది. కేసును ముగిస్తున్నట్లు పేర్కొంది అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 200(1)లోని మొదటి నిబంధన ప్రకారం బిల్లులను సాధ్యమైనంత త్వరగా ఆమోదం తెలపాలని ధర్మాసనం సూచించింది. రెండు బిల్లుల విషయంలో ప్రభుత్వం నుంచి అదనపు సమాచారం కోరినట్లు గవర్నర్ తరఫు న్యాయవాది వాదించగా.. కీలక బిల్లులను తిప్పి పంపారని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు.

kcr, brs, tamilisai

బిల్లులు తిప్పి పంపాలంటే వీలైనంత వెంటనే పంపొచ్చని, కానీ తన వద్దనే పెండింగులో పెట్టుకోవడం సరైంది కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ లో ఒక వారంలో, గుజరాత్ ఒక నెలలో బిల్లలకు గవర్నర్ ఆమోదం తెలుపుతున్నారని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్లకు బిల్లులను తిప్పి పంపే అధికారం ఉందని నొక్కి చెప్పిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. గవర్నర్లు కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

అయితే గత కొంత కాలంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ్యాబ్ పెరిగింది. గవర్నర్ ఎక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ పాటించకపోవడంతో గవర్నర్ ఇబ్బందిపడ్డ విషయం తెలిసిందే.. అయితే కొన్ని బిల్లుల విషయంలో కావాలానే గవర్నర్ జ్యాప్యం చేశారని విమర్శాలు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ పై బహిరంగంగా విమర్శలు కూడా చేశారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఒక్క అడుగు ముందుకేసి గవర్నర్ పై అసభ్య పదజాలం వాడాడు. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ కావడంతో క్షమాపణలు చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+