దొంగ తెలివి: వివాహేతర సంబంధం పెట్టుకుని పుస్తెలతాడు, ఇంకా..

నల్లగొండ: ఓ దొంగ జైలు నుంచి విడుదలైన తర్వాత నేరుగా తన ఇంటికి వెళ్లకుండా జైలులో పరిచయమైన వ్యక్తి ఊరికి వెళ్లి తిరిగి చోరీలు చేస్తూ జల్సాలు చేయడం, ఇతరులకు విందులు ఇవ్వడం ప్రారంభించాడు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెకు మూడు తులాల బంగారు పుస్తెల తాడు, ఖరీదైన చరవాణి, ద్విచక్రవాహనం కొనిచ్చాడు.

దాన్ని గమనించిన మరో ముగ్గురు మహిళలు కూడా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని డబ్బులు తీసుకున్నారు. తాను దొంగిలించిన బంగారాన్ని ఆ మహిళల చిరునామాల మీద తనఖా పెట్టి ప్రైవేట్ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు. జల్సాల కోసం అతను పది తులాల బంగారాన్ని, రూ.4 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

Theif arrested in Nalgonda district

జైలులో ఉన్నప్పుడు దోస్తీ కుదిరిన మిత్రుడితో అతని గ్రామానికి వెళ్లాడు. అప్పుడప్పుడు కూలికిపోవడం మిగతా సమయాల్లో ఇళ్లకు కన్నం వేయడం ప్రారంభించాడు. అలా దొంగలించిన సొత్తుతో గ్రామస్థులతో కలిసి జల్సాలు చేయడం. జల్సాల్లో ఎవరికి ఎంత ఖర్చు పెట్టాడో రోజువారీగా పేర్లతో సహా పక్కాగా లెక్క రాశాడు. తీరా ఆదొంగ మళ్లీ పోలీసులకు దొరికాడు.

నల్గొండ జిల్లా కనగల్‌ మండలం తుర్కపల్లి పరిధిలో ఎం.గౌరారానికి చెందిన ఓ వ్యక్తి జైలుకెళ్లాడు. జైలులో ఆయనతో పెన్‌పహాడ్‌ మండలం మహ్మాదాపురానికి చెందిన ఓ వ్యక్తి దోస్తీ చేశాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ వ్యక్తి తనను ఇంట్లోకి రానీయడం లేదని చెప్పి ఎం.గౌరారానికి వచ్చి ఆశ్రయం పొందాడు.

ఆరు నెలలుగా వారంలో మూడు రోజులు కూలీకి పొవడం నాలుగు రోజులు ఇంటి వద్ద ఉండేవాడు. ఇలా ఇంటివద్ద ఉన్న సమయాల్లోనే వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన సొమ్ముతో ఎవరెవరికి మద్యం తాగించింది, ఎవరెవరికి తినిపించింది, ఖర్చు పెట్టింది, అప్పుగా ఇచ్చింది, ఎవరెవరితో సంబంధం పెట్టుకుంది ఇలా రోజువారీగా లెక్క రాసి పెట్టాడు. ఆ పద్దులను తేల్చడంలో పోలీసులు నిమగ్నమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+