శబరిమలకు వెళ్ళే అయ్యప్ప భక్తులు తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే!

తెలుగు రాష్ట్రాలలో మాలధారులు పెరిగిపోయారు. మండల మకరవిళక్కు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. ఇక మకర జ్యోతి దర్శనానికి వెళ్లడానికి అయ్యప్ప స్వాములు మాలధారణ చేశారు. ఎంతో నియమనిష్ఠలతో అయ్యప్పలు ఈ సీజన్లో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే చలికాలంలో కఠోరమైన అయ్యప్ప దీక్షను ఆచరించేవారు కొన్ని ఆరోగ్య చిట్కాలను పాటించాలి.

శబరిమలకు వెళ్ళే భక్తులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
ముఖ్యంగా శబరిమలకు వెళుతున్న భక్తులు అక్కడ ఎటువంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండటం కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం సూచించిన సూచనలను తూచా తప్పకుండా పాటించాలి. మాలధారణ చేసిన భక్తులు శబరి గిరులపై కొలువైన అయ్యప్ప స్వామి ఆలయానికి దర్శనానికి వెళుతున్న సమయంలో అనారోగ్య సమస్యలు ఏర్పడితే తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. భక్తుల కోసం శబరిమల ఆలయ మార్గంలో ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.

These are the health tips for Ayyappa devotees those who are going to Sabarimala

అయ్యప్ప స్వాములు ఈ విషయాలలో జాగ్రత్త
ఈ ఆరోగ్య కేంద్రాలలో చికిత్స తీసుకోవాలి. అలాగే శబరిమల కు వెళుతున్న భక్తులు ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించిన మందులను మానివేయకూడదు. రెగ్యులర్ గా బీపీ, షుగర్ వంటి ఏదైనా అనారోగ్యానికి మందులు వాడితే వాటిని కంటిన్యూ చేయాలి. ఇక ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మూత లేని ఆహారాన్ని తినకూడదు.

కొండపైకి వెళ్ళేటప్పుడు ఇలా చెయ్యకూడదు
ఇక అయ్యప్ప ఆలయానికి నడిచి వెళ్లే భక్తులు మాల ధారణ చేసిన సమయంలో కూడా నడకను అలవాటు చేసుకోవాలి. లేదంటే ఒకేసారి నడిచి వెళ్లాలంటే అసౌకర్యం కలుగుతుంది. తీర్థయాత్రకు వెళ్లడానికి ముందే నడకను, కొన్ని వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి. ఫిట్నెస్ అంతగా లేనివారు కొండపైకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన చోట ఆగి విశ్రాంతి తీసుకుని వెళ్లాలి. భోజనం చేసిన వెంటనే కొండపైకి ఎక్కడం చేయకూడదు.

వైద్య సహాయం కావాలంటే ఇలా చెయ్యాలి
అయ్యప్ప స్వాముల కోసం నీలిమల, అపాచిమేడు, పంబ, సన్నిధానం ఆస్పత్రులలో గుండె సంబంధిత, వైద్య పరీక్షలు అందుబాటులో ఉంటాయి. కనుక స్వాములు ఈ విషయాన్ని గుర్తించాలి. తీర్థయాత్ర చేసే సమయంలో సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లను మాత్రమే తాగాలి. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప స్వాములు ఏదైనా వైద్య సహాయం కావాలంటే 04735203232 నెంబర్ కు కాల్ చేయాలి. ఈ జాగ్రత్తలు పాటించి అయ్యప్ప స్వాములు స్వామి దర్శనాన్ని చేసుకోవటంతో పాటు ఆరోగ్యంపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+