కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే .. 16 రోజులపాటు 54 సభలు!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రచార దూకుడును మరింత పెంచారు. ఈసారి ఎలాగైనా మూడవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ ఇప్పటికే ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటున్నారు. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది.
ఈనెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు సీఎం కేసీఆర్ మొత్తం 16 రోజులపాటు 54 సభలలో పాల్గొననున్నారు. 13వ తేదీ దమ్మపేట, బూర్గంపాడు ,నర్సంపేట తో ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్ 28వ తేదీన వరంగల్ ఈస్ట్ ,వరంగల్ వెస్ట్, గజ్వేల్ సభలతో తన ప్రచారానికి ముగింపు పలకనున్నారు. ఇప్పటివరకు 30 నియోజకవర్గాలలో ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. ఇప్పుడు మళ్ళీ 54 సభలకు హాజరుకానున్నారు.

ఇక సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విషయానికి వస్తే నవంబర్ 13వ తేదీన దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట లలో, నవంబర్ 14వ తేదీన పాలకుర్తి, హాలియా, ఇబ్రహీంపట్నంలో కెసిఆర్ సభలలో ప్రసంగిస్తారు. నవంబర్ 15వ తేదీన బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ లలో సీఎం కేసీఆర్ ప్రచార సభలో పాల్గొంటారు.
16వ తేదీన ఆదిలాబాద్, బోద్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ లలో సభలలో పాల్గొంటారు. నవంబర్ 17న కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్, పరకాల సభలలో కేసీఆర్ పాల్గొంటారు. నవంబర్ 18న చేర్యాల, నవంబర్ 19న ఆలంపూర్, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి సభల్లో పాల్గొంటారు.
నవంబర్ 20న మానకొండూరు, స్టేషన్ ఘన్పూర్ , నకిరేకల్, నల్గొండ, నవంబర్ 21న మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, 22వ తేదీన తాండూర్, కొడంగల్, మహబూబ్నగర్, పరిగి, 23వ తేదీన మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్ చెరు, 24వ తేదీన మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలలో ప్రచార సభలలో పాల్గొననున్నారు.
25వ తేదీ హైదరాబాదులో ప్రజా ఆశీర్వాద సభ లోను, 26వ తేదీ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక లోను సీఎం కేసీఆర్ సభలలో పాల్గొననున్నారు. 27వ తేదీ షాద్నగర్, చేవెళ్ల, ఆందోల్, సంగారెడ్డి లలో, 28వ తేదీన వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వేల్ లో ప్రజా ఆశీర్వాద సభలలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.












Click it and Unblock the Notifications