సీఎంగా ప్రకటించాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ ఇదే!!

ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర రెండవ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 7వ తేదీన ముహూర్తం ఖరారయ్యింది. ఇక తనను సీఎం గా ప్రకటించిన తర్వాత ఢిల్లీకి బయలుదేరిన రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన తొలి ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్లో రేవంత్ రెడ్డి తనను ముఖ్యమంత్రిగా ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్ణాటక డిప్యూటీసీఎం డీకే శివకుమార్, తెలంగాణ ఇన్చార్జి, జనరల్ సెక్రెటరీ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ట్వీట్లో సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా అభివర్ణించారు.

This is Revanth Reddy first tweet after being announced as CM!!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో అడుగడుగునా ముళ్లదారి అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు. అవమానాలు, అరెస్టులు ఎన్నో భరించారు. కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర సీఎంగా స్థానాన్ని సంపాదించుకున్న రేవంత్ రెడ్డి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగారు. ఆయన రాజకీయాల్లోకి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వచ్చిన వ్యక్తి కాదు. కార్యకర్త స్థాయి నుంచి రాజకీయాలు చేస్తూ మాస్ లీడర్ గా ఎదిగి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ట్రెండ్ సృష్టించిన వ్యక్తి రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి పై తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటిస్తున్న వేళ రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టే రేవంత్ రెడ్డి, ఏ మేరకు తన పాలనను సక్సెస్ చేస్తారో తెలియాల్సి ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో, పాలనలో ఆయన తన మార్క్ ను కొనసాగిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+