ఇదేం అవగాహన సర్పంచ్ గారూ ... పల్స్ పోలియో చుక్కలు మీరే వేయించుకుంటారా ?

ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఓ సర్పంచ్ ఘనకార్యం చేసింది. చిన్నారులకు పోలియో చుక్కలు మీద అవగాహన కల్పించాలని, తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని చెప్పాలనుకున్న ఆ మహిళా సర్పంచ్ తాను పోలియో చుక్కలు వేయించుకుంది.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో కొండూరు మండలం పర్వతాపూర్ గ్రామంలో ఆదివారం రోజు చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

This is the awareness of a sarpanch ... sarpanch dipped pulse polio drops to her

ఆదివారం నాడు వైద్య ఆరోగ్యశాఖ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ప్రచారం చేసింది. ఇక ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి వచ్చిన సర్పంచ్ సరస్వతి పిల్లలకు అవగాహన కల్పించడం కోసం తాను పల్స్ పోలియో చుక్కలు వేయించుకుంది.

అవగాహన కల్పించడం అంటే గ్రామాల్లో ప్రచారం నిర్వహించి, చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించుకునే లా చర్యలు చేపట్టడం కానీ అంత వయసు వచ్చిన తర్వాత పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవటం కాదు అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్ కి తెలియకపోతే సిబ్బంది జ్ఞానం ఏమైంది అంటూ చుక్కలు వేసిన సిబ్బందిపై కూడా మండిపాటు గురవుతున్నారు గ్రామస్తులు. అయితే పిల్లలకు అవగాహనకల్పించటం కోసం అలా చేశాను అంటూ తాను చేసిన ఘనకార్యం గురించి పల్స్ పోలియో చుక్కలు వేయించుకున్న 'చిన్నారి' సర్పంచ్ చెప్పడం కొసమెరుపు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+