హైదరాబాద్‌లో ఐసిస్‌ కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: నగరంలో మరోసారి ఐసీస్ ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఉత్తరప్రదేశ్ పోలీసులు శనివారం ముగ్గురు ఉగ్రవాదులను నగరంలోని టోలీచౌక్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు.

అబ్దుల్ మాలిక్, ఫజులుల్లా, ఖయ్యూం అనే ఐసీస్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వీరు పేలుళ్లకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. లక్నో నుంచి వచ్చిన ఎన్ఐఏ అధికారులు, పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో శనివారం ఉదయం వీరిని అరెస్ట్ చేశారు.

Three ISIS terrorists has been arrested in Hyderabad on Saturday.

ఐసీస్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, వారి కార్యకలాపాలకు సహకరించడం వంటి చర్యలకు వీరు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఈ ముగ్గురు ఉగ్రవాదులు హైదరాబాద్‌లోని ఉంటున్నట్లు తెలిసింది. వీరిని యూపీకి తీసుకెళ్లి అక్కడే విచారించనున్నట్లు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Three ISIS terrorists has been arrested in Hyderabad on Saturday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి