ఇష్టం లేని వారిపై రంగులు చల్లితే..: హైదరాబాద్ పోలీసుల ఉత్తర్వులు

Holi 2025: రేపే హోలీ పండగ. తెల్లవారు జామున కాముని దహనం అనంతరం రంగులు చల్లుకుంటూ ఆనందోత్సాహాల మధ్య ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పండగను జరుపుకొంటారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా స్థానిక సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా దీన్ని నిర్వహించుకుంటారు.

హోలీ పండగ కోసం హైదరాబాద్ ముస్తాబవుతోంది. మినీ ఇండియాగా గుర్తింపు ఉంది హైదరాబాద్‌కు. దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇక్కడ నివసిస్తోన్నారు. ఇక్కడ నివసిస్తోన్న రెండు తెలుగు రాష్ట్రాల వారితో పాటు రాజస్థానీలు, గుజరాతీలు, పంజాబీలు, బెంగాలీలు ఈ పండగ కోసం సన్నద్ధమౌతోన్నారు.

ఈ నేపథ్యంలో- శాంతి భద్రతలపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా పరిమితంగా ఆంక్షలను విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.

Holi Hyderabad

ఇష్టం లేని వ్యక్తులపై రంగులు చల్లడాన్ని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నిషేధించారు. రంగులు చల్లుకోవడానికి ఇష్టపడని వాళ్లకు బలవంతంగా వాటిని పూయడం, నీళ్లను చల్లడంపై నిషేధం విధించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో హోలీ రంగులను చల్లుకోవడంపైనా నిషేధం ఉంది.

వాహనాలపై రంగు చల్లడం లేదా రంగు నీటిని పోయడాన్ని కూడా ఈ నిషేధం పరిధిలోకి తీసుకొచ్చారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా హోలీ పండగను జరుపుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి. ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ప్రమాదాలకు దారి తీసేలా స్కూటర్లు, బైకులు, కార్లు, వాహనాల్లో తిరుగాడటం, బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా తిరగడంపై ఆంక్షలు విధించారు.

ఈ సాయంత్రం 6 గంటల నుండి 15వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం తెల్లవారు జామున 6 గంటల నుండి శనివారం తెల్లవారు జామున 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+