• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మేడం..బండి ఇక్కడ పెట్టొద్దన్నందకు ఐదు ప్రాణాలు బలి..!రూల్స్ గుర్తు చేసిన టోల్ ప్లాజా ఉద్యోగి ఎక్కడ?

|

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ విషాద ఉదంతంలో ఐదు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద రోజూ తన ద్విచక్ర వాహనాన్ని ఓ మూలన పార్క్ చేసుకుని తన పని చూసుకుని తిరిగి వచ్చిన తర్వాత యథావిధిగా తన వాహనం తీసుకుని ఇంటికి వెళ్లే దిశకు ఆరోజు ఎదురైన విచిత్ర అనుభవం విషాదంతం అవుతుందని తాను ఊహించలేక పోయింది. ఎప్పటిలాగే తన వాహనాన్ని అక్కడే పార్క్ చేసి ఉండి ఉంటే గనక ఇంతటి దారుణం జరిగి ఉండి ఉండేది కాదు, ఐదు కుటుంబాల్లో ఇంతటి విషాదం చోటు చేసుకుని ఉండేదీ కాదు. ఎప్పటిలాగే ఆరోజు నవంబర్ 27న తన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేస్తున్న దిశకు అక్కడి సిబ్బంది గుర్తు చేసిన నిబంధనల వల్ల ఇంత ఘోరం జరిగినట్టు స్పష్టమవుతోంది.

Disha case encounter : దిశ కేసులో షాకింగ్ నిజాలు.. అసలు ఎన్ కౌంటర్ చెయ్యటానికి కారణాలు ఇవేనా ?

టోల్ ప్లాజా ఉద్యోగి అభ్యంతరం..

టోల్ ప్లాజా ఉద్యోగి అభ్యంతరం..

దిశ వాహానం పార్కింగ్.. టోల్ ప్లాజా ఉద్యోగి అభ్యంతరం..

ఒక చిన్న తప్పు వెయ్యి తప్పులను చేయిస్తుందనడానికి దిశ హత్యోదంతమే ఉదహరణగా చెప్పుకోవచ్చు. మూడు పదులు నిండని యువకులు, అందులో తాగిన మత్తులో ఉన్నప్పుడు వారి ఆలోచనలు చాలా వరకు భిన్నంగా ఉంటాయి. తాగిన మైకం తాగుబోతులకు ఎక్కడ లేని తెగింపు, మొండి ధైర్యాన్ని తెచ్చి పెడుతుంది. సమాజంలో జరుగుతున్న చాలా రుగ్మతలకు ఇదే కారణంగా తెలుస్తోంది. అంతే కాకుండా తాగిన మైకం తలకెక్కిన తర్వాత విచక్షణ కూడా కోల్పోతారు. అందుకు తొండుపల్లి టోల్ ప్లాజా లో జరిగిన దిశ ఉదంతమే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. తాగిన మత్తులో ఉన్న నలుగురు యువకులు దిశ వాహనం పార్క్ చేస్తుండగా అతి సమీపంగా చూడటం, వారిలో లేని పోని వికృత ఆలోచనలకు బీజం పడడం క్షణాల్లో జరిగి పోయింది.

 నిబంధనలు గుర్తు చేసిన టోల్ ప్లాజా ఉద్యోగి.. వాహనాన్ని దూరంగా పార్క్ చేసిన దిశ..

నిబంధనలు గుర్తు చేసిన టోల్ ప్లాజా ఉద్యోగి.. వాహనాన్ని దూరంగా పార్క్ చేసిన దిశ..

వాహనం పార్క్ చేసి వెళ్లిందంటే ఆ మహిళ మళ్లీ ఏదో ఒక సమయానికి తన వాహనం కోసం వస్తుందని ఆ తాగుబోతులు నిర్ధారించుకున్నారు. ఇంతకు తన వాహనాన్ని ఆ తాగుబోతుల చేరువలోనే దిశ ఎందుకు పార్క్ చేయాల్సి వచ్చింది..? విశాలంగా ఉండే టోల్ ప్లాజాలో ఎక్కడో మూలన దిశ తన వాహనాన్ని పార్క్ చేస్తే ప్లాజా అంతా ఇరుకుగా మారిపోయిందా..? టోల్ ప్లాజా ఉద్యోగి దిశ వాహన పార్కింగ్ పట్ల ఎందుకు అభ్యంతరం చెప్పాడు. అభ్యంతరం చెప్పినా పరవాలేదులే ఓ గంటలో తీసుకెళ్తాను అని సమాధానం దిశ ఎందుకు చెప్పలేక పోయింది..? వాహనాన్ని పార్క్ చేయొద్దని టోల్ ప్లాజా ఉద్యోగి చెప్పిన మరుక్షణమే అంత దూరం కాకుండా కొంచెం పక్కనే అడ్జస్టు చేసి ఉండి ఉంటే పరిస్ధితి మరోలా ఉండేది.

 నిందితుల సమీపంలో వాహనం పార్క్ చేసిన దిశ.. వికృత ఆలోచన వచ్చింది అక్కడే..

నిందితుల సమీపంలో వాహనం పార్క్ చేసిన దిశ.. వికృత ఆలోచన వచ్చింది అక్కడే..

అంతే కాకుండా దిశ తన వాహనాన్ని నేరుగా తాగుబోతుల ముందు పార్క్ చేయడం, మత్తులో ఉన్న వాళ్లు దిశను అతి సమీపంగా చూడడంతో వారి ఆలోచనలు అప్పుడే పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. వాహనం కోసం దిశ తిరిగి వస్తుందని, అప్పుడు ఏదో ఒకటి చేయాలని క్షణాల్లో పథకానికి రూపకల్పన చేసుకున్నారు తాగుబోతులు. అంటే మొత్తం ఎపిసోడ్ లో ఆ నలుగురు తాగుబోతులకు దిశ కనపడకుండా ఉండి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండకపోవనే అంశం స్పష్ట మవుతోంది. ముందుగా పార్క్ చేసిన వాహనానికి ఎవ్వరూ అభ్యంతరం చెప్పి ఉండక పోతే ఐదు నిండు ప్రాణాలు పోయేవి కాదని స్పష్టమవుతోంది. చిన్న ద్విచక్ర వాహనం పార్కింగ్ విషయంలో అంత నిబంధనలు పాటించిన ఉద్యోగులు, మరి గంటల తరబడి టోల్ ప్లాజా పరిధిలో మద్యం సేవిస్తున్న వారికి ఎందుకు అభ్యంతరం చెప్పలేదనేదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

 టోల్ ప్లాజా ఉద్యోగి కూడా శిక్షార్హుడే.. నిబంధనలు అందరికి వర్తించాలి..

టోల్ ప్లాజా ఉద్యోగి కూడా శిక్షార్హుడే.. నిబంధనలు అందరికి వర్తించాలి..

అంటే నిబంధనలు కూడా అమాయకంగా, హుందాగా కనపడేవారిని చూడగానే గుర్తొస్తాయా..? పీకల దాకా తాగి అడ్డంగా ఎదురు తిరిగి దుర్బాషలాడే వారికి వర్తించవా..? అంటే నోరున్నోడిదే ఊరా..? టోల్ ప్లాజా ఉద్యోగి ఆ రోజు దిశ వాహనం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఇంతటి ఘాతుకం జరిగింది. నిబంధనలు అందరికి ఒకే లాగా అమలు చేయాలి. దిశ దారుణ హత్యలో తరుచుగా అక్కడ వాహనం పార్క్ చేస్తున్న సంగతి మర్చి పోయి కఠినంగా వ్యవహరించిన టోల్ ప్లాజా ఉద్యోగి తప్పు కూడా ఉంది. దిశను దారుణంగా కాల్చి చంపిన ఘటనలో నలుగురు ముద్దాయిలది ఎంత తప్పు ఉందో టోల్ ప్లాజా ఉద్యోగిది కూడా అంతే ఉందని స్పష్టమవుతోంది.

English summary
The toll plaza employee objected the Disha vehicle Parking On that day. The rules should be implemented like everyone. There is also a mistake of Toll plaza employee who has been severely damaged by the vehicle in the murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X