విషాదం: సీనియర్ నటి అన్నపూర్ణ కూతురు ఆత్మహత్య
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. సొంత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కూతురికి మాటలు రాకపోవడంతో ఒత్తిడికి లోనైన కీర్తి డిప్రెషన్‌కు గురయ్యారు.
ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని తెలుస్తోంది. అనారోగ్య సమస్యలే కీర్తి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications