Tomato: భారీగా పడిపోయిన టమాటా ధరలు..!

నెల క్రితం వరకు రూ.50 నుంచి రూ.60 పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పడిపోయింది. 15 రోజల క్రితం వరకు కిలో టమాట రూ.25 నుంచి 30 ఉండగా.. తాజాగా కిలో టమాటా రూ.10 నుంచి రూ.15 పలుకుతోంది. ఇక టమాటా రైతులకు కిలోకు రూ.5 మాత్రమే పడుతోంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని పత్తికొండ మార్కెట్లో కిలో ధర రూ.5 పలికింది. దీంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదు.

మొన్నటి వరకు ధర ఎక్కువ ఉండడంతో రైతులు టమాటా సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా కిలో రూ.150 పలికిన టమాటా ధర ఆ తర్వాత క్రమంగా తగ్గి భారీగా పడిపోయింది. మరోవైవు ఉల్లి ధరలు వేగంగా పెరుగుతోన్నాయి. కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు ఉల్లి కొనడానికి వెనుకాడుతున్నారు.

Tomato prices fell sharply on Monday as supply exceeded demand

రాష్ట్రంలో ఉల్లి సాగు భారీగా తగ్గింది. ఇక అటు పక్క రాష్ట్రంలో ఏపీలోని కర్నూలు జిల్లాలో కూడా ఉల్లి సాగు తగ్గింది. దీంతో డిమాండ్ కు సరిపడ ఉల్లి లేకపోవడంతో ధరలు భారీగా పెరుగుతోన్నాయి. మహారాష్ట్రలో కూడా కూడా ఉల్లి దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. వచ్చే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దేశంలో ఉల్లి ధరలు తగ్గాలంటే.. ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించాలంటున్నారు.

అలాగే కేంద్ర వద్ద ఉన్న బఫర్ స్టాక్ ను కూడా విడుదల చేయాలని కోరుతున్నారు. గతంలో ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఉండేవి. ఆంక్షలతో దేశీయంగా ఉల్లి ధరలు భారీగా తగ్గాయి. దీంతో ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్ర రైతులు ఉల్లి ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో కేంద్రం ఉల్లి ఎగుమతులపై ఆంక్షలను సడలించింది. అయితే త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు ఉన్నందున ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించకపోవచ్చని తెలుస్తోంది. అయితే బఫర్ స్టాక్ విడుదల చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+