సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, హైదరాబాద్ నగరంలోని మెట్రో పిల్లర్ల వేదికగా ఒక వినూత్న విజ్ఞాపన సీఎం రేవంత్ రెడ్డికి చేస్తున్నారు. మెట్రో పిల్లర్ల పైన హోర్డింగ్స్ ఏర్పాటుచేసి లక్ష మందిని కాపాడాలని చేస్తున్న విజ్ఞప్తి ఇప్పుడు ఆ మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు ఎవరు ఈ లక్ష మంది? ఏమిటి వీరి విజ్ఞాపన అంటే?

సీఎం గారు సేవ్ హోర్డింగ్స్ అంటూ మెట్రో పిల్లర్స్ పై హోర్డింగ్స్

తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హోర్డింగ్స్ ద్వారా తమ విజ్ఞప్తిని చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి సీఎం గారు సేవ్ హోర్డింగ్స్ అంటూ రాసుకొచ్చారు. లక్ష మందిని కాపాడండి అంటూ ఆ హోర్డింగ్స్ లో పేర్కొన్నారు. జీవో ఎంఎస్ నెంబర్ 84 రద్దు చేయండి అంటూ తమ గోడును విజ్ఞప్తి చేశారు.

TOMO innovative appeal save one lakh people hoardings on Hyderabad city Metro pillars

జీవో ఎంఎస్ నెంబర్ 84ను రద్దు చేయాలని విజ్ఞప్తి

జీవో ఎంఎస్ నెంబర్ 84 వల్ల నగరంలో ఏర్పాటు చేసే భారీ హోర్డింగ్స్ పైన నియంత్రణలు విధిస్తున్న పరిస్థితి ఉందని, ఇది తమ పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తుందని, లక్షమంది ఉపాధిపైన దీని ప్రభావం ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర సమస్యల పైన చర్చ జరుగుతున్న సమయంలో తమ సమస్యను పరిష్కరించాలంటూ, తమకు ఇబ్బందిగా మారిన జీవో ఎంఎస్ నెంబర్ 84ను రద్దు చేయాలని వారు కోరుతున్నారు.

అసెంబ్లీ సమావేశాల వేళ ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే యత్నం

తెలంగాణ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ హోర్డింగ్స్ ఏర్పాటు చేసి మరీ సీఎం రేవంత్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తుంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ, ప్రభుత్వం దృష్టిని ఆకర్షించడానికి వారు ఈ ప్రయత్నం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చీప్ ఫార్ములా పేరుతో కెసిఆర్ ప్రభుత్వం పైన ఇదే తరహాలో నిరసన తెలిపింది.

అవుట్ డోర్ మీడియా ఓనర్స్ గోడు రేవంత్ రెడ్డి వింటారా?

ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అవుట్ డోర్ మీడియా ఓనర్స్ తమ మనుగడ కోసం ఈ వినూత్న పద్ధతిని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి లక్ష మందిని కాపాడాలని హోర్డింగ్స్ ద్వారా రేవంత్ రెడ్డికి విజ్ఞాపన చేసిన అవుట్ డోర్ మీడియా ఓనర్స్ గోడు రేవంత్ రెడ్డి వింటారా అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+