Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 గంటలకు టీవీ చూడండి.. కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

సీఎం కేసీఆర్ దూకుడు పెంచుతున్నారు. జనంతో కలిసిపోతున్నారు. వనపర్తి జిల్లా నాగవరంలో భారీ బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నానని తెలిపారు. నిరుద్యోగులు అందరూ ఉదయం 10 గంటలకు టీవీ చూడాలని వెల్లడించారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నానని వివరించారు.

 కొట్లాడి మరీ..

కొట్లాడి మరీ..


తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా ఉద్యమం చేపట్టి కొట్లాడామో అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే దేశం కోసం కూడా అలాగే పోరాడదామని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఉద్ఘాటించారు. వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వెల్లడించారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని అన్నారు.

5 మెడికల్ కాలేజీలు

5 మెడికల్ కాలేజీలు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని వివరించారు. హైదరాబాదు నుంచి గద్వాల దాకా ధాన్యపురాశులతో కళకళలాడుతోందని పేర్కొన్నారు.

పొలాల్లోకి వెళ్లి మరీ

పొలాల్లోకి వెళ్లి మరీ


పాలమూరు జిల్లా పాలుగారుతోందని, తాను సంతోషం పట్టలేక పొలాల్లోకి వెళ్లి చూశానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలంతా తిరిగి వచ్చారని తెలిపారు. 11 రాష్ట్రాల నుంచి పనుల కోసం తెలంగాణకే వలస వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అద్భుతమైన పల్లెలు రూపుదిద్దుకోనున్నాయని పేర్కొన్నారు.

Recommended Video

    Analysis On Telangana Budget 2022 - 2023 టాప్ హైలెట్స్ ఇవే | Oneindia Telugu
    10 గంటలకు తప్పకుండా..

    10 గంటలకు తప్పకుండా..


    వచ్చే ఏడాదే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సమయం తీసుకొని మరీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. రేపు బడ్జెట్ సెషన్ తిరిగి ప్రారంభమై.. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ కామెంట్స్ చర్చకు దారితీశాయి. టీవీ పెట్టుకుని మరీ చూడాలని కోరడంతో ఏం చెబుతారనే టెన్షన్ ఉంది. ఉద్యోగాలపై ప్రకటన చేస్తారని సమాచారం.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+