అరాచక పాలన మరువం: కేసీఆర్‌పై మహేశ్ కుమార్ గౌడ్ షాకింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెనుకబాటుకు గురైందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసీఆర్‌కు మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు.
ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే మీ(బీఆర్ఎస్) పార్టీ నాయకులు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. సెంటిమెంట్ పేరుతో రెండుసార్లు అధికారంలోకి వచ్చి మీరు గడీల పాలనతో ప్రజలకు కన్నీరు మిగిల్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించి.. పీఠమెక్కాక మాయమాటలతో పాలించారని కేసీఆర్ పాలనపై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు.

మీ అల్లుడు హరీశ్ రావు పెట్రోల్ డబ్బాతో అగ్గిపుల్లతో డ్రామాలు చేసి అమాయక యువతను బలిదానాలవైపు ప్రోత్సహించారనేది వాస్తవం కాదా? మేము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 54 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే రికార్డు నెలకొల్పామని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. ఉద్యమ సమయంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పిన మీరు అధికారంలోకి వచ్చాక మీ ఫ్యామిలీకి ఉపాధి కల్పించుకున్నారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మీకు, మీ అనుచరులకు ఒక ఏటీఎంలా మారిందనేది అక్షర సత్యమని కేసీఆర్‌ను ఉద్దేశించి మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
16 వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మీరు మార్చింది వాస్తవం కాదా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవ సుందరీకరణలో అవినీతి జరిగిందని మీ పుత్రరత్నం గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్ కోసం రూ. 150 కోట్లే ఖర్చు చేశాం. మూసీ కోసం అదనంగా ఖర్చు చేయలేదని మీరు గుర్తించాలని మహేశ్ కుమార్ గౌడ్.. కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ తల్లి, గేయానికి గుర్తింపు లేదని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. తమ పాలనలో ఆనందంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవాకులు చెవాకులు మానుకోవాలి. ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు, కవితను కేసీఆర్ అదుపులో పెట్టాలి. దళితుడిని సీఎం చేస్తానని మాయమాటలతో సీఎం పీఠం ఎక్కి.. అధికారం చేపట్టగానే కుటుంబ పాలన సాగించావు. రాష్ట్రాన్ని పదేళ్లు మీ కుటుంబ సభ్యుల కబంధ హస్తాల్లో బంధించావు.. కేసీఆర్ మీరు చేసిన అరాచకాన్ని ప్రజలు ఎప్పటికీ మరువరు అని మహేశ్ కుమార్ గౌడ్












Click it and Unblock the Notifications